close

ప్రధానాంశాలు

టీమిండియాకొచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

లండన్‌: టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన భారత్ సెమీస్‌ మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోల్తా పడింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే సెమీఫైనల్లో ఓడిన భారత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సుమారు రూ.5.47 కోట్లు (0.8 మిలియన్ల డాలర్లు) ప్రైజ్‌ మనీగా ఇవ్వనుంది. సెమీస్‌కు చేరిన ప్రతి జట్టుకూ 0.8 మిలియన్ల డాలర్ల చొప్పున ప్రైజ్‌ మనీ దక్కుతుందని ఐసీసీ తెలిపింది.

ఇక ప్రపంచకప్‌ విజేతకు 4 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ. 27.38 కోట్లు... రన్నరప్‌కు 2 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ.13.7 కోట్లు అందనుంది. ప్రపంచకప్ జట్టు నెగ్గిన జట్టు ప్రైజ్‌మనీతో పాటు బంగారు ట్రోఫీ కూడా అందుకుంటుంది. లీగ్‌ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు గాను జట్టుకు సుమారు రూ. 27.4 లక్షలు (40 వేల డాలర్లు) చొప్పున అందిస్తారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీని ఐసీసీ ఈ సారి అందిస్తోంది.



మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net