చెక్కతో ఎకో ఫ్రెండ్లీ కారు.. ఓ లుక్కేయండి..!

వార్తలు / కథనాలు

చెక్కతో ఎకో ఫ్రెండ్లీ కారు.. ఓ లుక్కేయండి..!

మరీ లాంగ్‌ ట్రిప్‌ అయితే కష్టమేనేమో!

కారు.. ఎక్కాలని, నడపాలని చాలామందికి కోరిక. కొత్త కారును కొనుగోలు చేయలేని వారు కనీసం పాత కారునైనా కొనుక్కొని ఆ ముచ్చటను తీర్చుకుంటుంటారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన కార్లన్నీ ఉక్కు, అల్యూమినియం వంటి లోహాలతో తయారు చేస్తుంటారు. అయితే కేవలం చెక్కతో తయారు చేసిన కారు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? కింద బేస్‌ మొత్తం లోహంతో చేసి పైన చెక్కతోనే రూపొందించిన ఓ ఎకో ఫ్రెండ్లీ కారు గురించి తెలుసుకుందాం... 

19వ శతాబ్దంలోనే చెక్కతో తయారు చేసిన కార్లు వచ్చాయి. అయితే వాటిని ఎక్కువగా వాహన తయారీదారులే వాడుకుంటూ వచ్చేవారు. అయితే 1978లో విలియమ్స్‌ టౌన్స్‌ రూపొందించిన ఇంటర్‌స్టైల్ హస్ట్లర్‌ కారు పర్యావరణహిత మోడల్‌ కావడం విశేషం. ఈయన అప్పట్లో ప్రాచుర్యం పొందిన ఆస్టిన్‌ మార్టిన్‌ లగోండా మోడల్‌ కారు రూపకర్త. కింద బేస్‌, గ్లాస్‌ తప్ప మిగతా చెక్కనే వినియోగించి ఇంటర్‌స్టైల్‌ కారును తయారు చేశాడు. హెడ్‌లైట్స్‌ను హిల్‌మాన్‌ హంటర్‌, టైయిల్‌లైట్స్‌ను ట్రింఫ్‌ డోలోమైట్‌ నుంచి తెప్పించాడు. అయితే 1982 మోడల్‌ హస్ట్లర్‌ ఉడెన్‌ వేరియంట్‌ను అత్యున్నత నైపుణ్యం కలిగిన కార్పెంటర్‌తో విడి భాగాలను తయారు చేయించాడు. కారు తలుపులు పెద్దగా ఉండి, పైన సామానును కట్టుకునేందుకు కూడా చెక్కనే వినియోగించాడు. ముందు, వెనుక రెండేసి సీట్లను ఏర్పాటు చేశాడు. కారును నడిపేటప్పుడు బాగా కుదుపులు, శబ్ధం వచ్చేవి. అయినా కొంచెం దూరం వెళ్లడానికి ఎలాంటి అసౌకర్యంగా అనిపించదు. అయితే వీటిపై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం మాత్రం కాస్త ఇబ్బందే అని చెప్పుకోవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న