ఈ గొర్రె ధర తెలిస్తే.. బుర్ర తిరుగుద్ది!

వార్తలు / కథనాలు

ఈ గొర్రె ధర తెలిస్తే.. బుర్ర తిరుగుద్ది!

(బ్రిటీష్‌ టెక్సెస్‌ షీప్‌ సోసైటీ ఫేస్‌బుక్‌‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గొర్రె ధర ఎంత ఉంటుంది? రూ.వేలల్లో ఉండొచ్చు. మేలైన జాతి గొర్రెలైతే రూ.లక్షలు విలువ చేయొచ్చు. కానీ ఇటీవల వేలంలో ఓ గొర్రె ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. దీని ధరెంతో తెలుసా? అక్షరాలా రూ. 3.57 కోట్లు!!

నెదర్లాండ్స్‌లోని టెక్సెల్‌లో గొర్రెల పరిశ్రమ ఉంది. ఇక్కడి గొర్రెలకు ఉత్తమ జాతి గొర్రెలుగా పేరుంది. అయితే ఇటీవల కొత్తగా జన్యుపరంగా ఉత్తమమైన గొర్రె ‘డబుల్‌ డైమండ్‌’ను వేలంలో పెట్టారు. దీనిని సొంతం చేసుకునేందుకు యూకే వ్యాప్తంగా పాడి రైతులు పోటీ పడ్డారు. అయితే దీని ధర మొదటి నుంచి అధికంగా ఉండటంతో ఎలాగైనా ఈ గొర్రెను దక్కించుకోవాలని వేలానికి ముందే కొందరు సంయుక్తంగా కొనాలని నిర్ణయించుకున్నారట. వేలానికి రాగానే ఓ ముగ్గురు పాడి రైతులు కలిసి అత్యధికంగా 4,90,000డాలర్లు (రూ.3,75,78,379)పెట్టి ఆ గొర్రెను సొంతం చేసుకున్నారు. గతంలో ఇక్కడి వేలంలో అమ్ముడుపోయిన గొర్రె ధర రూ. 2.24 కోట్లేనట. ఇప్పుడు ఈ నెలల వయసున్న ‘డబుల్‌ డైమెండ్‌’ గొర్రెను తీసుకెళ్లి.. పెరిగిన తర్వాత దాని వీర్యం సేకరించి కృత్రిమ గర్భధారణతో ఈ జాతి గొర్రెలను మరిన్ని సృష్టించాలని రైతులు భావిస్తున్నారట!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న