close

వార్తలు / కథనాలు

హత్తుకునే మాటలు... ముచ్చటైన పాటలు

ప్రేమికుల దినోత్సవ ప్రత్యేకం

‘హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ..ప్రేమ..’ అన్నాడో సినీ రచయిత. నిజమే ప్రేమకుండే పవిత్రతే అది. ప్రేమ గురించి ఎందరో కవులు ఎన్నో నిర్వచనాలిచ్చారు. చిన్నారి బోసినవ్వంత స్వచ్ఛమైనది...‘ప్రేమ’. దేవుడి గుడిలో పువ్వంత పవిత్రమైనది... ‘ప్రేమ’. ఇంకా చెప్పాలంటే ఎవ్వరి ఊహలకు అందనిది. ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమను మాటల్లో బయటపెట్టడం చాలా కష్టం. అందుకే కొందరు మాటల రూపంలో.. ఇంకొందరు పాటల రూపంలో ప్రేమను వ్యక్తపరుస్తారు. మన సినిమాల్లో హీరోహీరోయిన్లు ‘ప్రేమ’గా చెప్పుకొన్న కొన్ని మాటలను, పాటలను ‘ప్రేమికుల రోజు’ సందర్భంగా మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం!

మాటల్లో ప్రేమ

* గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం. కానీ గుండెలో ఉన్నమాట కేవలం కళ్లతోనే చెప్పగలం!

- నువ్వే కావాలి

* బ్రేకప్‌ చెప్పాలనిపిస్తే అది ప్రేమ కాదు..నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్‌ అవ్వదు!

- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

* ప్రేమ డబ్బుని తెస్తుందేమో కానీ..డబ్బు ప్రేమను తీసుకురాదు!

- రాజు మహరాజు

 

* అర్హత లేని అమ్మాయి కోసం అరక్షణం ఎదురు చూసినా తప్పే..మనసులోని అమ్మాయి కోసం జీవితాంతం ఎదురు చూసినా తప్పులేదు!

- రాజా రాణి

 

* నిజమైన ప్రేమంటే వెంటపడి ప్రేమించడం ఒక్కటే కాదు. మనం ప్రేమించిన వాళ్లకి మనం వల్ల చెడు జరుగుతుంది అనుకుంటే వదిలేయడం కూడా!

- సోలో

* ఇష్టమైన వాళ్లు పక్కన ఉంటే పల్లెవెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం.కానీ ఇష్టం లేని వాళ్లు పక్కన ఉంటే బెంజ్‌కారులో కూడా ఇబ్బందిగానే వెళ్తాం!

- నేను లోకల్‌

* మన లైఫ్‌లోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా..మనం ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం!

- తొలి ప్రేమ(2018)

* నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్ట పడటం..దూరంగా ఉన్నప్పుడు బాధపడటం..దానికి మించి నాకింకేం తెలీదు!

- మళ్లీ రావా

* ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమను వదులుకోవడం కాదు!

- శతమానం భవతి

* మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారొచ్చు. పరిస్థితులు మారొచ్చు. ప్రపంచం మారొచ్చు.కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ మారదు శైలు.నిన్ను చూసిన ప్రతిసారీ నీతో ప్రేమలో పడటం!

- నేను శైలజ

* నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు..నీటిలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయ్‌

- అందాల రాక్షసి

* నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే..ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను!

- ఆర్య

* ప్రేమంటే ఎదురు చూపులను కూడా వెతుక్కోవడమే!

- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

* నీ వల్ల ఒకరు కన్నీరు పెడితే అది పాపం. నీకోసం కన్నీరు పెడితే అది ప్రేమ!

- అనగనగా ఓ అమ్మాయి 

* నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట నేను ఉండలేను!

- వర్షం


పాటల్లో ప్రేమ

* నువ్వే నువ్వే కావాలంటుంది. పదే పదే నా ప్రాణం. నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం

- నువ్వే నువ్వే

 

* ఉండిపోరాదే గుండె నీదేలే.. హత్తుకోరాదే గుండెకే నన్నే

- హుషారు

 

* ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ..ఎక్కడ నా ప్రాణం.. ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం!

- నేను లోకల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు