పచ్చగడ్డి మరకలున్నా ఫ్యాషనే మరి!

వార్తలు / కథనాలు

పచ్చగడ్డి మరకలున్నా ఫ్యాషనే మరి!


(ఫొటో: గుచ్చి వెబ్‌సైట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్: వేసుకునే దుస్తులకు చిన్న మరక అంటితేనే అది పోయే వరకు ఉతుకుతాం. మరక పోలేదంటే ఆ దుస్తులను మూలకు పడేస్తాం. అలాంటిది ప్రముఖ వస్త్ర సంస్థ గుచ్చి(gucci)  మరకలు అంటినట్టుగా ఉండే జీన్స్‌లను విక్రయిస్తుంటే ఫ్యాషన్‌ ప్రియులు ఎగబడి కొనేస్తున్నారు.

కాలంతో పాటు వేసుకునే దుస్తుల ఫ్యాషన్‌ మారిపోతూ ఉంది. నిత్యం రకరకాల డిజైన్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుచ్చి సంస్థ రాబోయే శీతాకాలం స్పెషల్‌ అంటూ పచ్చగడ్డి మరకల జీన్సులను తీసుకొచ్చింది. ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ జీన్స్‌ల మోకాళ్ల వద్ద పచ్చగడ్డి రాసుకుపోతే అంటుకునే మరకల్లాంటివి డిజైన్ చేశారు. వాటిని చూస్తే నిజమైన మరకల్లానే కనిపిస్తాయి. ట్రెండీ ఫ్యాషన్‌ దుస్తుల అమ్మే బ్రాండెడ్‌ సంస్థ కాబట్టి అందులో అమ్మే ఏ దుస్తులకైనా ఖరీదు ఎక్కువే ఉంటుంది. అయితే ఈ మరకలంటినట్లుగా ఉండే జీన్స్‌ ధర 770 డాలర్లు(దాదాపు రూ.57వేలు) ఉండటం అందరిని విస్మయపరుస్తుంది. వెర్రి ఫ్యాషన్‌ అంటే ఇదే కాబోలు..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న