ఛారిటీ కోసం గరిటె పట్టిన హ్యారీ దంపతులు 

వార్తలు / కథనాలు

ఛారిటీ కోసం గరిటె పట్టిన హ్యారీ దంపతులు  

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రిన్స్‌ హ్యారీ, మెగన్‌ మార్కెల్‌ దంపతులు బ్రిటన్‌లో రాజభోగాలు వదిలేసి అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో సామాన్యులుగా జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు స్వచ్ఛంద సంస్థలకు తమ వంతుగా సాయపడుతూ ఉన్నారు. తాజాగా ఓ సంస్థ కోసం హ్యారీ దంపతులు గరిటె పట్టారు. ఆ తర్వాత వీరిద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ స్వచ్ఛంద సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది.

లాస్‌ ఏంజెల్స్‌లోని హోంబాయ్‌ ఇండస్ట్రీస్‌ ఓ స్వచ్ఛంద సంస్థ. ఏటా 9వేల మందికి ఉద్యోగ శిక్షణ ఇస్తోంది. అలాగే డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారిని సాధారణ స్థితికి తీసుకురావడం, యువత వేసుకునే టాటూలను తొలగించడం, మానసిక రోగులకు సహాయపడటం, ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం, ఉచిత న్యాయసేవలు వంటివి అందిస్తోంది. తాజాగా హోంబాయ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కేఫ్‌, బేకరీ తినుబండారాలు తయారు చేసి ఆకలితో ఉన్నవారికి అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌ హ్యారీ, మెగన్‌ మార్కెల్‌ పాల్గొన్నారు. ఇద్దరు కలిసి వంటలు చేయడంలో, ఫుడ్‌ ప్యాకింగ్‌లో సాయం చేశారు. తమతో కలిసి హ్యారీ దంపతులు పనిచేయడంతో సంస్థలోని వాలంటీర్లు ఎంతో సంతోషపడ్డారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలను హోంబాయ్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న