జామ్‌-చాక్లెట్సే రంగులు.. చెంచాలే కుంచెలు!

వార్తలు / కథనాలు

జామ్‌-చాక్లెట్సే రంగులు.. చెంచాలే కుంచెలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీకు జామ్‌.. చాక్లెట్స్‌.. తేనె వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? లొట్టలేసుకుంటూ తినేస్తారు కదా..! కానీ, ఈజిప్ట్‌కు చెందిన సల్లీ మాగ్డి మురాద్‌ వాటితో అందమైన చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటోంది. పాతికేళ్ల మురాద్‌ తండ్రి పెయింటర్‌.. ఆయన కళ కూతురుకు అబ్బింది. చిన్నతనం నుంచి కుంచె పట్టుకొని చిత్రాలు గీయడం మొదలుపెట్టిన మురాద్‌.. పాఠశాల, కాలేజీ స్థాయిలో అనేక పోటీల్లో చిత్రలేఖనంలో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. అయితే, ఇటీవల కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో రంగులు.. కుంచెలతో పెయింటింగ్‌ కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని భావించింది. అలా జామ్‌.. సాస్‌.. చాక్లెట్స్‌నే రంగులుగా మలిచి, చెంచాలనే కుంచెలుగా చేసి ప్లేట్‌పై బొమ్మలు గీయడం ప్రారంభించింది. ఈజిప్ట్‌లో పేరొందిన ప్రముఖుల ముఖాలు.. అందమైన అమ్మాయిల ముఖాలు.. ప్రకృతి అందాలు ఇలా అన్నింటిని ఆవిష్కరిస్తోంది. ఈ వినూత్న చిత్రాలను ఎప్పటికప్పుడు మురాద్‌ సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుండటంతో వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఆ చిత్రాలను మీరూ చూసేయండి..


(ఫొటోలు: సల్లీ మాగ్డి ఫేస్‌బుక్‌)

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న