close

వార్తలు / కథనాలు

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంకో రెండు రోజుల్లో మరో ఏడాది కాలగమనంలో కలిసిపోనుంది. ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలతో 2018 వెళ్లిపోతుంటే, సరికొత్త ఆశలతో 2019 స్వాగతం పలుకుతోంది. ఈ నేపథ్యంలో 2018లో ఆవిష్కృతమైన అద్భుతాలు, అత్యంత అరుదైన, మనసును కదిలించిన చిత్రాల్లో కొన్ని మీకోసం..

1. ఈ ఏడాది కేరళలో సంభవించిన వరదల విలయ తాండవం యావత్‌ దేశాన్ని కలిచివేశాయి. ఆ సేతు హిమాచలం కేరళకు అండగా నిలిచింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి, ఆహార పదార్థాలు, తాగునీరు అందించడంలో నావికాదళ సిబ్బంది అహరహం శ్రమించింది. అలా సహాయం పొందిన ఓ కుటుంబం నావికాదళానికి మేడపై ఇలా ‘థ్యాంక్స్‌’ అని కృతజ్ఞతలు తెలిపింది.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

2. మధ్యధరా సముద్రతీరంలో చమురు సంపన్న దేశమైన సిరియా ఆరేళ్లకుపైగా అంతర్యుద్ధంతో నలిగిపోతోంది. కాగా, గాయపడిన ఓ చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్న సహాయ సిబ్బంది.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

3. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని అక్టోబర్‌ 31న భారత ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో సర్దార్‌ సరోవర్‌ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు. దీని ఎత్తు 182 మీటర్లు.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

4. దేశంలో నదీజలాలు ఎంత కలుషితం అయిపోతున్నాయో చెప్పడానికి నిదర్శనం ఈ చిత్రం. కాలుష్య యమునా నదీ జలాల్లో ఏనుగు కడుగుతున్న మావటి.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

5. సౌర మండలంలోని గ్రహాల్లో ఒకటైన భూమికి ఉపగ్రహంగా చంద్రుడు ఉన్నట్లే మిగిలిన గ్రహాలకూ ఉపగ్రహాలుంటాయని తెలిసిందే. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం శనిగ్రహం చంద్రుడు 'టైటాన్' స్పష్టమైన చిత్రాలను విడుదల చేసింది.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

6. 13మంది ప్రాణాలను బలిగొన్న ఆడపులి ‘అవని’ని అటవీశాఖ అధికారులు అంతమొందించారు. మహారాష్ట్రలోని యవత్మల్‌ జిల్లా తూర్పు ప్రాంతంలో అవనిని హతమార్చారు. ఐదేళ్ల వయసు ఉన్న అవనికి పది నెలల వయసున్న రెండు పిల్లలు ఉన్నాయి.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

7. కేరళ వరద బీభత్సం చూసి చలించని వారు లేరు. అలాగే ఈ చిత్రంలో కనిపిస్తున్న మోహనన్‌ అనే బిచ్చగాడు కూడా తన వంతు సాయం చేశాడు. కేరళ వరద బాధితులకు సాయం అందించేందుకు నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చి స్థానిక రాజకీయ నాయకుడికి తనవంతు విరాళం అందించాడు.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

8. భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఈ ఏడాది ఆగస్టు 16న కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశానికి ఆయన చేసిన మహోన్నత సేవలను అందరూ గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయీ అంతిమయాత్ర ప్రారంభమైన దగ్గరి నుంచి చివరి వరకూ భారత ప్రధాని నరేంద్రమోదీ నడుచుకుంటూ వెళ్లారు.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

9. అందాలతార శ్రీదేవి హఠాన్మరణం చిత్ర పరిశ్రమనే కాదు, యావత్‌ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. దుబాయ్‌లో ఓ వేడుకకు హాజరైన ఆమె అక్కడే బాత్‌ టబ్‌లో పడి చనిపోయారు. భారత్‌కు తీసుకువచ్చిన ఆమెను కడసారి చూసేందుక అభిమానులు పోటెత్తారు.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..

10. రాజకీయ కురు వృద్ధుడు, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూయడం తమిళ ప్రజలనే కాకుండా యావత్‌ దేశాన్ని కలిచివేసింది. ఆయన భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు వచ్చిన విలపిస్తున్న ఆయన అభిమానులు.

ఈ ఏడాది మరువలేని చిత్రాలు..


Tags :

మరిన్ని