close

వార్తలు / కథనాలు

అలలపై గాబీరా ‘మాయ’

ఔరా అనిపించే సాహసం‌ చేసిన పోర్చుగల్‌ మహిళ


అలలపై గాబీరా ‘మాయ’

ఇంటర్నెట్‌డెస్క్‌: సముద్రంలో వచ్చే ఎత్తయిన అలలను చూస్తేనే ఒక్కోసారి భయమేస్తుంది. అటువంటి అలలను దాటుకొంటూ సర్ఫింగ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది 68 అడుగుల ఎత్తయిన అలపై సర్ఫింగ్‌ చేయడమంటే.. వామ్మో అనాల్సిందే! ఎంతో నేర్పు, అనుభవం ఉన్న సర్ఫర్లు కూడా ఒక్కోసారి ఈ సాహసాన్ని చేసేందుకు వెనుకాడతారు. అయితే.. ఓ మహిళ మాత్రం దాన్ని చేసి చూపించి అందరితోనూ ఔరా..! ఏమి ఈ సాహసం అనిపించింది. ఆ సాహసమే ఇప్పుడు ఆమెకు ప్రపంచ రికార్డుని సాధించి పెట్టింది. అంతేకాదు.. ఆమె ఎక్కడైతే సర్ఫింగ్‌ చేసి గాయపడిందో మళ్లీ అదే ప్రాంతంలో సర్ఫింగ్‌ చేసి ఈ రికార్డును సృష్టించడం విశేషం. ఆమె మరెవరో కాదు.. 31ఏళ్ల బ్రెజిలియన్‌ మహిళ మాయ గాబీరా.

అలలపై గాబీరా ‘మాయ’

ఈ ఏడాది జనవరిలో నజారేలో నిర్వహించిన వరల్డ్‌ సర్ఫ్‌ లీగ్‌లో గాబీరా 68అడుగుల ఎత్తయిన అలపై సర్ఫింగ్‌ చేసింది. కానీ, అప్పుడు ఆమెకు తెలియదు.. అదొక రికార్డని. 2013లో ఇదే ప్రాంతంలో గాబీరా సర్ఫింగ్‌ చేస్తూ ప్రమాదానికి గురైంది. అయితే, ఈసారి అత్యంత ఎత్తయిన అలపై సర్ఫింగ్‌ చేసిన మహిళగా ఆమె నిలిచింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆమె పేరుపై ఈ రికార్డు నమోదవడం గమనార్హం. దీనిపై గాబీరా తెగ సంతోషపడిపోతోంది.

ప్రపంచ రికార్డు సృష్టించాలనే నా కల చాలా ఏళ్ల నుంచి ఉంది. 2013లో సర్ఫింగ్‌ చేసే సమయంలో నేను ప్రమాదానికి గురయ్యాను. ఆ సమయంలో నా కల దూరమవుతుందేమోనని అనుకున్నాను. కానీ, ఆశ్చర్యకరంగా నాకు ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే సర్ఫింగ్‌ చేసి రికార్డు సృష్టించాను’ అని చెబుతూ తెగ సంబరపడింది మాయ గాబీరా.

 


Tags :

మరిన్ని