పొట్ట త్వరగా తగ్గాలంటే...
close
Updated : 12/04/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొట్ట త్వరగా తగ్గాలంటే...

పొట్ట ఎక్కువగా ఉంటే... చీర కట్టుకున్నా... ఆధునిక దుస్తులు వేసుకున్నా ఇబ్బందే. ఈ ఆసనాలతో సులువుగా పొట్టను తగ్గించుకోవచ్చు. చూడచక్కని ఆకృతిని సొంతం చేసుకోవచ్చు.

నౌకాసనం

కాళ్లను ముందుకు చాపి నేల మీద కూర్చోవాలి. మోకాళ్ల దగ్గర కాస్త వంచి పైకిలేపాలి. చేతుల్ని నిటారుగా కాళ్ల పక్కన ఉంచాలి. ఈ స్థితిలో ఇరవై సెకన్లపాటు ఉండాలి. మూడు నుంచి నాలుగు రౌండ్లు ఇలా చేయాలి. ఈ ఆసనంలో శరీర బరువంతా పిరుదుల మీద పడుతుంది. పొట్ట, పిరుదుల దగ్గరి అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది.


చతురంగ దండాసనం

నేల మీద బోర్లా పడుకోవాలి. పాదాలు, మోచేతుల మీద బరువు మోపుతూ శరీరాన్ని పైకి లేపాలి. మరీ ఎక్కువగా పైకి లేపకూడదు. ఈ స్థితిలో పది సెకన్లపాటు ఉండాలి. తర్వాత ఈ సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు, శరీర బరువు త్వరగా తగ్గుతుంది.


నాభి ఆసనం

కింద పడుకుని చేతులను శరీరానికి రెండు వైపులా ఉంచాలి. చేతుల మీద బరువు మోపి తల, భుజాలు, కాళ్లను పైకి లేపాలి. కాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ శవాసనం వేయాలి. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పొట్ట దగ్గరి కండరాలన్నీ బలోపేతమవుతాయి. గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలన్నీ అదుపులోకి వస్తాయి.


వశిష్టాసనం

కాళ్లను చాపి కూర్చోవాలి. కుడి చేతి మీద బరువు మోపి ఎడమ చేతిని పైకి ఎత్తాలి. కాళ్లను ఫొటోలో చూపినట్టుగా ఉంచాలి. రెండు కాళ్ల మీదా బరువు వేయడం వల్ల శరీరం సులువుగానే పైకి లేస్తుంది. దీంతో దేహం చక్కని ఆకృతిని సంతరించు కుంటుంది. పొట్ట చుట్టూ ఉండే అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది.

 


సత్వర ఫలితాలకు...
కీరా, నిమ్మకాయను చక్రాల్లా కోసి లీటరు నీటిలో వేయాలి. దీంట్లోనే చిన్న అల్లం ముక్కను కూడా వేయాలి. పుదీనాను శుభ్రంగా కడిగి కాడలతో సహా వేయాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. మర్నాడు రెండు గ్లాసుల నీరు తాగి ఈ ఆసనాలు వేయాలి. మిగిలిన నీటిని అల్పాహారం తిన్న తర్వాత తాగొచ్చు. ఇరవైఒక్క రోజులపాటు ఇలా చేస్తే పొట్ట త్వరగా తగ్గుతుంది.


 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని