261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్‌స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్‌కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది.