బిజినెస్లో ఒత్తిడి లేకుండా..!
వ్యాపారం అంటేనే సవాలుతో కూడుకున్నది. ఎప్పుడు లాభాలొస్తాయో, ఏ క్షణం నష్టాలు పలకరిస్తాయో చెప్పలేం! దీనికి తోడు మార్కెట్లో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే! అయితే ఇలాంటి సవాళ్లతో కూడిన ప్రయాణంలో ఎంత ప్రణాళికతో వ్యవహరించినా ఒత్తిడి, ఆందోళనలు దరిచేరడం సహజం.