Dulquer Salmaan: ‘కల్కి’లో దుల్కర్?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో యువ అగ్రకథానాయకుడు కూడా నటించనున్నట్లు సమాచారం.