Twitter: ప్రపంచ వ్యాప్తంగా కొంత సమయం పాటు ట్విటర్‌ సేవల్లో అంతరాయం

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ సేవల్లో అంతరాయం నెలకొంది. ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పలువురు యూజర్లు శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ట్విటర్‌ సేవల్లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

Updated : 12 Feb 2022 06:24 IST

 ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ సేవల్లో కొంత సమయం అంతరాయం నెలకొంది. తమ ఖాతాలు పనిచేయడం లేదంటూ ప్రపంచ వ్యాప్తంగా పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత యూజర్ల ట్విటర్‌ ఖాతాల్లో సమస్యలు వచ్చాయి. భారత్‌లో గంటపాటు ట్విటర్‌ సేవలను ఉపయోగించుకోలేకపోయినట్లు పలువురు యూజర్లు పేర్కొన్నారు. మొబైల్స్‌తో పాటు వెబ్‌సైట్‌లో కూడా సమస్యలు వచ్చినట్లు తెలిపారు. లోడింగ్‌ సమస్యతో పాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని కొందరు, లాగిన్‌ కాలేకపోయామని కొందరు పేర్కొన్నారు. ట్విటర్‌ ఉపయోగిస్తుండగానే లాగౌట్‌ అయిందని మరికొందరు ఫిర్యాదు చేశారు.   

దీనిపై ట్విటర్‌ సపోర్ట్‌ టీమ్‌ స్పందించింది. సాంకేతికంగా సమస్య తలెత్తిందని, వెంటనే సరిచేసినట్లు తెలిపింది. అంతరాయానికి క్షమించాలని యూజర్లకు విజ్ఞప్తి  చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని