Corona: జర్మనీలో కరోనా కల్లోలం.. ఫిబ్రవరిలో మరింత గరిష్ఠానికి కేసులు!

జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వచ్చే నెలలో ఇది ......

Published : 21 Jan 2022 01:48 IST

బెర్లిన్‌: జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వచ్చే నెలలో ఇది గరిష్ఠస్థాయికి చేరే అవకాశం ఉందని, ఈ క్రమంలో భారీగా కొవిడ్‌ కేసులు నమోదవుతాయని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్‌బాచ్ అంచనా వేశారు. ఫిబ్రవరి మధ్య నాటికి తమ దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి గరిష్ఠానికి చేరుకొనే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి ఆస్పత్రి చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ రాబోయే వారాల్లో క్లినిక్‌లు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇతర యూరోపియన్‌ దేశాలతో పోల్చి చూస్తే ఇంకా టీకాలు వేయించుకోని 50 ఏళ్లు పైబడిన వారు తమ దేశంలో గణనీయంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు, గడిచిన 24గంటల వ్యవధిలోనే జర్మనీలో 1,33,536 పాజిటివ్‌ కేసులు, 234 మరణాలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని