వచ్చే ఎన్నికల్లోనూ బైడెన్‌, కమల ద్వయం పోటీ!

అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీచేస్తాననీ, తనతోపాటు కమలా హారిస్‌ తిరిగి ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతం 79వ పడిలో ఉన్న...

Published : 21 Jan 2022 05:10 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీచేస్తాననీ, తనతోపాటు కమలా హారిస్‌ తిరిగి ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతం 79వ పడిలో ఉన్న బైడెన్‌కు 2024 ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయి. ఆయన ఇప్పటికే అమెరికా చరిత్రలో కురు వృద్ధ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. మరి 81 ఏళ్ళ వయసులో దేశాధ్యక్షునిగా బరువుబాధ్యతలను నిర్వహించే శారీరక, మానసిక సత్తా ఆయనకు ఉంటుందా అని సందేహాలు రేగుతున్నాయి. బుధవారంతో అధ్యక్ష పదవిలో ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా వైట్‌ హౌస్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. 57 ఏళ్ల కమలాహారిస్‌ అమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా, తొలి నల్లజాతి, భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఉపాధ్యక్ష పదవిలో ఆమెకు కార్యనిర్వహణ స్వేచ్ఛ లభించడం లేదనీ, అసలు బైడెన్‌ ప్రభుత్వంలో ఆమెకు ప్రాముఖ్యం లభించడం లేదని ఆరోపణలు వస్తున్న సమయంలో బైడెన్‌ వచ్చే ఎన్నికల్లో కూడా కమలనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని