WHO: ఒమిక్రాన్ది డెల్టాను మించిన వేగం..తేలిగ్గా తీసుకోకండి: డబ్ల్యూహెచ్‌వో
ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
ఐక్యరాజ్యసమితి/జెనీవా: ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, త్వరలోనే డెల్టాను అధిగమిస్తుందని వెల్లడించింది. తక్కువ సమయంలో ఈ వేరియంట్ కేసులు రెట్టింపు అవుతున్నాయని, ఇది చాలా సులభంగా రోగనిరోధక శక్తిని తప్పించుకుంటోందని పేర్కొంది. ‘‘జన్యు క్రమాన్ని విశ్లేషించే సామర్థ్యం మెరుగ్గా ఉన్న అన్ని దేశాల్లోన్లో ఒమిక్రాన్ ఉనికిని కనుగొన్నాం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు కనుగొన్న వాటిలో ఇదే అతి పెద్ద ఆధిపత్య వేరియంట్. కొందరు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు ఏదో జలుబులా భావిస్తున్నారు. దీని తీవ్రత అంతగా ఉండదని ఊహించుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఈ వేరియంట్‌తో ఆసుపత్రులు పాలవుతున్న వారూ అధికంగా ఉన్నారు.
ఇప్పటికే రోగాలున్న వారు.. వృద్ధులు, టీకాలు తీసుకోనివారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది’’ అని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ శాస్త్రవేత్త మరియా వాన్ కెరోవ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. జనవరి 3-9 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 55 శాతం పెరుగుదల. వారంలో 43 వేల మంది మృతి చెందారు. ఆఫ్రికాలో తప్ప అంతటా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ మాత్రం 11 శాతానికి పడిపోయాయి. అమెరికాలో కొత్త కేసుల్లో (46,10,359) 73 శాతం వృద్ధి కనిపించింది. తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్ (15,97,203. 46% వృద్ధి), యూకే (12,17,258.. 10% వృద్ధి) ఉన్నాయి. ఐరోపాలో 31 శాతం కేసులు పెరిగాయి. అయితే మరణాలు 10 శాతానికి తగ్గాయి. ఆగ్నేయాసియాలో ఏకంగా 400% మేర వృద్ధి కనిపించింది. ఇందులో అత్యధిక కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్‌ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్‌కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్‌లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..