America: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు

Published : 20 Jan 2022 04:58 IST

అమెరికా: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని