అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నా.. పరిష్కారం ఏమిటి?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 20 ఏళ్లు. నేను గత కొన్ని నెలలుగా వెజైనాతో పాటు ఇతర శరీర భాగాల్లో ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నా. ఇందుకోసం Histafree 120, Nueforce 150.. వంటి యాంటీ ఫంగల్‌ మందులు వాడుతున్నా.

Published : 22 Jan 2022 16:59 IST

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 20 ఏళ్లు. నేను గత కొన్ని నెలలుగా వెజైనాతో పాటు ఇతర శరీర భాగాల్లో ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నా. ఇందుకోసం Histafree 120, Nueforce 150.. వంటి యాంటీ ఫంగల్‌ మందులు వాడుతున్నా. అయినా ఎలాంటి ఫలితం లేదు. నేను ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: మీకు శరీర భాగాలన్నింటిలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ఉందంటున్నారు. సాధారణంగా ఆరోగ్యంగా, యుక్తవయసులో ఉన్న వారికి ఇటువంటి విపరీతమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావు. అసలు ఇంత ఎక్కువగా రావడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ఫిజీషియన్‌ని, డెర్మటాలజిస్ట్‌ని ఇద్దరినీ సంప్రదించాలి. బరువు ఎక్కువగా ఉండడం, డయాబెటిస్‌ వంటి జబ్బులు, శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు తగ్గిపోవడం.. వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. మీకు సాధారణ పరీక్షలతో పాటు డయాబెటిస్, రీ ప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్ (RTI).. వంటివి ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే మీ శరీరంపై ఉన్న ఫంగస్‌ ఏ జాతికి చెందిందో తెలుసుకోవడానికి సంబంధిత కల్చర్‌ టెస్టులు.. ఇవన్నీ చేసిన తర్వాత దానికి తగిన చికిత్స అందిస్తారు. కానీ మందులు దీర్ఘకాలికంగా వాడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్