Updated : 17/08/2021 08:26 IST

Corona Vaccine: వ్యాక్సిన్‌ నాణ్యత ధ్రువీకరణ.. ఇక హైదరాబాద్‌లోనే

ఎన్‌ఐఏబీకి సీడీఎల్‌ హోదానిచ్చిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ టీకా నాణ్యతను ధ్రువీకరించే కేంద్రీయ ఔషధ ప్రయోగశాల (సెంట్రల్‌ డ్రగ్‌ లేబొరేటరీ-సీడీఎల్‌) హోదాను కేంద్ర ప్రభుత్వం తాజాగా హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)కి కట్టబెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇకపై ఇది సీడీఎల్‌ తరహాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ బ్యాచ్‌లను పరీక్షించి వాటి విడుదలకు ఆమోదముద్ర వేయనుంది. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దీనికి ఈ అధికారాన్నిచ్చారు. 2020 నవంబర్‌ 11న కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దేశంలో ఇంకేదైనా కొత్త ప్రయోగశాలకు వ్యాక్సిన్‌ నాణ్యతా ధ్రువీకరణ కేంద్ర హోదా కట్టబెట్టవచ్చా?..అన్న అంశంపై బయోటెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక శాఖలతో పాటు, శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌) అభిప్రాయాన్ని కోరారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించాక బయోటెక్నాలజీ శాఖ.. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏబీ, పుణేలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌(ఎన్‌సీసీఎస్‌) పేర్లను ప్రతిపాదించింది. ఈ రెండు ప్రయోగశాలల ఆధునీకరణకు పీఎం కేర్స్‌ నుంచి నిధులు సమకూర్చింది. పుణేలోని ఎన్‌సీసీఎస్‌ ల్యాబ్‌ను 2021 జూన్‌ 28నే సీడీఎల్‌ లేబొరేటరీగా గుర్తించగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏబీకి సైతం ఆ హోదా దక్కింది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ నాణ్యత ధ్రువీకరణ మరింత వేగవంతమై.. టీకా పంపిణీ ప్రక్రియ జోరందుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని