CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్‌-1 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సీబీఎస్‌ఈ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల టర్మ్‌-1 పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. పదో తరగతి మేజర్‌ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 11వరకు జరుగుతాయి. 12వ

Updated : 19 Oct 2021 10:00 IST

ఈనాడు, దిల్లీ: సీబీఎస్‌ఈ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల టర్మ్‌-1 పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. పదో తరగతి మేజర్‌ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 11వరకు జరుగుతాయి. 12వ తరగతి మేజర్‌ సబ్జెక్టుల పరీక్షలు డిసెంబర్‌ 1న మొదలై 22వరకు సాగుతాయి. రెండు తరగతుల పరీక్షలూ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. పదోతరగతి మైనర్‌ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్‌ 17 నుంచి, 12వ తరగతి మైనర్‌ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్‌ 16 నుంచి ప్రారంభమవుతాయి. వీటి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. కరోనా నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలను రెండు భాగాలుగా విభజించింది. టర్మ్‌-1లో పరీక్షలు ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటాయి. ఈ టర్మ్‌ అయిపోయిన వెంటనే మార్కుల జాబితా రూపంలో ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో ఎవరినీ పాస్‌, కంపార్ట్‌మెంట్‌ లిస్ట్‌లో పెట్టరు. రెండు టర్మ్‌ల పరీక్షలు అయిపోయిన తర్వాతే తుది ఫలితాలు వెల్లడిస్తారు. రెండో టర్మ్‌ పరీక్షలు ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరుగుతాయి.

12వ తరగతి మేజర్‌ సబ్జెక్టుల పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

డిసెంబర్‌ 1: సోషియాలజీ
డిసెంబర్‌ 3: ఇంగ్లిష్‌ కోర్‌
డిసెంబర్‌ 6: మేథమెటిక్స్‌
డిసెంబర్‌ 7: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌
డిసెంబర్‌ 8: బిజినెస్‌ స్టడీస్‌
డిసెంబర్‌ 9: జియాగ్రఫీ
డిసెంబర్‌ 10: ఫిజిక్స్‌
డిసెంబర్‌ 11: సైకాలజీ
డిసెంబర్‌ 13: అకౌంటెన్సీ
డిసెంబర్‌ 14: కెమిస్ట్రీ
డిసెంబర్‌ 15: ఎకనమిక్స్‌
డిసెంబర్‌ 16: హిందీ ఎలెక్టివ్‌, హిందీ కోర్‌
డిసెంబర్‌ 17: పొలిటికల్‌ సైన్స్‌
డిసెంబర్‌ 18: బయాలజీ
డిసెంబర్‌ 20: హిస్టరీ
డిసెంబర్‌ 21: ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టికల్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌
డిసెంబర్‌ 22: హోమ్‌సైన్స్‌

10వ తరగతి మేజర్‌ సబ్జెక్టుల పరీక్షల షెడ్యూల్‌
నవంబర్‌ 30: సోషియల్‌ సైన్స్‌
డిసెంబర్‌ 02: సైన్స్‌
డిసెంబర్‌ 03: హోమ్‌సైన్స్‌
డిసెంబర్‌ 04: మేథమెటిక్స్‌ స్టాండర్డ్‌, బేసిక్‌
డిసెంబర్‌ 08: కంప్యూటర్‌ అప్లికేషన్‌
డిసెంబర్‌ 09: హిందీ కోర్స్‌-ఎ, కోర్స్‌-బి
డిసెంబర్‌ 11: ఇంగ్లిష్‌ (లాంగ్వేజ్‌, లిటరేచర్‌)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని