Updated : 15/11/2021 12:53 IST

Apple computer: యాపిల్‌ తొలి కంప్యూటర్‌.. వేలంలో ఎంత ధర పలికిందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple) పేరు వింటే చాలు.. ఆ సంస్థ తయారు చేసిన ఐఫోన్లు, యాపిల్ టీవీలు, మ్యాక్‌ బుక్‌లు, ఐపాడ్‌లు, యాపిల్‌ వాచ్‌లు గుర్తొస్తుంటాయి. ధర ఎక్కువని ఆలోచిస్తారు కానీ.. ఆ సంస్థ నుంచి విడుదలయ్యే ఉత్పత్తుల్లో ఒక్కటైనా, ఒక్కసారైనా వాడాలనుకుంటారు. ఎందుకంటే యాపిల్‌కు ఉన్న క్రేజ్‌ అటువంటిది. అలాంటిది 1976లో సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌, సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ మొదట తయారు చేసిన యాపిల్‌ కంప్యూటర్‌ (Apple Computer)ను వేలంలో పెడితే ఎవరైనా వదులుకుంటారా? అమెరికాలో నిర్వహించిన వేలంలో $4,00,000(₹2,97,38000.00)కు యాపిల్ మొదటి కంప్యూటర్‌ అమ్ముడుపోయింది. 

స్టీవ్ జాబ్స్‌ (Steve Jobs), వోజ్నియాక్ (Steve Wozniak) కలిసి యాపిల్‌-1(Apple-1) కంప్యూటర్లను 200వరకు తయారు చేశారు. అందులో ఇప్పడు వేలంలో విక్రయించిన కంప్యూటర్‌ కూడా ఒకటి. దీని పేరు ‘చఫే కాలేజ్’ యాపిల్‌-1. పేరు వింతగా ఉన్నప్పటికీ.. అప్పట్లో దీన్ని కాలిఫోర్నియాలోని రాంచో కుకమోంగాలోని చఫే కళాశాలలో పని చేసిన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ కొనుగోలు చేశారు. దాంతో ఈ కంప్యూటర్‌కు ఆ పేరు వచ్చింది. ఆయన దగ్గర చదువుకునే విద్యార్థి, ఆయన నుంచి 1977లో $650 (₹48,324.25)కు కొనుక్కున్నాడు. 

ఈ యాపిల్‌-1 కంప్యూటర్‌కు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కోవా వుడ్ అని పిలిచే అరుదైన హవాయి కలప కేసింగ్‌తో ఈ కంప్యూటర్‌ వస్తుంది. ఇదే ఈ కంప్యూటర్‌కు అదనపు ఆకర్షణ. ఇటువంటి కంప్యూటరే 2014లో జరిగిన వేలంలో ₹6.66 కోట్ల ($900,000)కు పైగా పలకడం విశేషం. యాపిల్‌ సంస్థ కాలిఫోర్నియాలోని చిన్న గ్యారేజ్‌లో ప్రారంభమైంది. జాబ్స్‌ వోజ్నియాక్, రొనాల్డ్‌ వేన్‌ కలిసి ఏప్రిల్‌ 1, 1976లో యాపిల్‌-1 కంప్యూటర్‌ను లాంచ్ చేశారు. స్టార్టప్‌గా వచ్చిన యాపిల్‌ సంస్థకు ఫండ్స్ కోసం జాబ్స్‌ తన మైక్రో బస్‌ను, వోజ్నియాక్.. హెచ్‌పీ-65 కాలిక్యులేటర్‌ను $500కు విక్రయించారు. దాదాపు 20 ఆపిల్-1 కంప్యూటర్లు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి.

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని