సండే టిప్‌: వాట్సాప్‌ సెక్యూరిటీ ‘కోడ్‌’

సాంకేతికంగా ఎంత వృద్ధి సాధించినా ఆపదలూ వెన్నంటే ఉంటాయని చెప్పేందుకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న..

Published : 21 Feb 2021 23:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికంగా ఎంత వృద్ధి సాధించినా ఆపదలూ వెన్నంటే ఉంటాయని చెప్పేందుకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల రాకతో ప్రతి ఒక్కరూ తమ అభిరుచులను అందరితో పంచుకునే అవకాశం కలిగింది. అయితే వ్యక్తిగత విషయాలు బయటకు వస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.  ఖాతాలను హ్యాక్‌ చేసేసి యూజర్ల సమాచారంతోపాటు సొమ్మును కొల్లగొట్టేస్తున్నారు. మరి అలాంటి హ్యాకర్ల నుంచి రక్షణ పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. మన సమాచారంతోపాటు మనమూ భద్రంగా ఉండొచ్చని చెబుతున్నారు టెక్‌ నిపుణులు. ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్న మెసేంజర్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. హ్యాకర్ల నుంచి  సైబర్‌ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ‘TWO STEP VERIFICATION’ అనే ఆప్షన్‌ను ఇప్పటికే చాలా మంది యూజర్లు వాడుతున్నారు. మరి అదేంటో, అదెలాగు చేయాలో మనమూ ఓసారి చూద్దాం.. 

వాట్సాప్‌ ఖాతాను కొత్త డివైజ్‌లో లాగిన్‌ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే హ్యాకర్లు రెచ్చిపోయే అవకాశం ఉంది. డివైజ్‌లో లాగిన్‌ కావాలంటే వాట్సాప్‌ నుంచి ఆరు అంకెల కోడ్‌ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. అయితే పొరపాటున ఈ కోడ్‌ హ్యాకర్లకు దొరికితే ఇక వారి పరికరంలోనే వాట్సాప్‌ను లాగిన్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. అప్పుడు మీ వాట్సాప్‌ నుంచి స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులను సొమ్ము అడిగి దండుకునే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా చేయాలంటే తప్పనిసరిగా ‘రెండు అంచెల వెరిఫికేషన్‌’ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవడం మంచిది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవడం ద్వారా పిన్‌కోడ్‌ పెట్టుకోవడంతోపాటు దానికి మీ అధికారిక ఈ-మెయిల్‌ను అటాచ్‌ చేసుకునే వీలు కలుగుతుంది. ‘TWO STEP VERIFICATION’ ఆప్షన్‌ను ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకునే అవకాశం ఉంది. 


యాక్టివేట్‌ చేసుకోవడం ఎలా..?

* రెండు అంచెల వెరిఫికేషన్ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి
* వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోని అకౌంట్‌ క్లిక్‌ చేయండి
* అకౌంట్‌లో ‘TWO STEP VERIFICATION’ ఆప్షన్‌ ఉంటుంది. 
* అక్కడ ఎనేబుల్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. 
* ఆరు అంకెల పిన్‌ను ఎంటర్‌ చేయాలి, తర్వాత కన్‌ఫార్మ్‌ చేయండి
* తర్వాత ఈ-మెయిల్‌ యాడ్‌ చేయాలి. ఈ-మెయిల్‌ ఇవ్వకుండా స్కిప్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే పొరపాటున పిన్‌ను మరిచిపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. 
* ఈ-మెయిల్‌ యాడ్‌ చేసిన తర్వాత ఎనేబుల్‌ అయిపోతుంది. వద్దు అనుకుంటే డిజేబుల్‌ చేసుకునే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు