Sony: సోనీ నెక్‌బ్యాండ్‌ స్పీకర్లు వచ్చేశాయ్‌.. ధరెంతంటే?

సోనీ కంపెనీ రెండు సరికొత్త వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ స్పీకర్లను భారత్‌లోకి వచ్చేశాయ్. SRS-NS7, SRS-NB10 పేర్లతో వీటిని కంపెనీ లాంచ్ చేసింది. ధరను.. 

Published : 25 Jan 2022 01:46 IST

దిల్లీ: సోనీ నుంచి రెండు సరికొత్త వైర్‌లెస్‌ నెక్‌ బ్యాండ్‌ స్పీకర్లు భారత్‌లోకి వచ్చేశాయ్‌. SRS-NS7, SRS-NB10 పేర్లతో వీటిని సంస్థ లాంచ్ చేసింది. SRS-NS7 నెక్‌బ్యాండ్‌ డాల్బీ 3డీ అట్మాస్‌ సౌండ్‌ను అందిస్తుంది. ‘సోనీ బ్రావియా XR’ టీవీలోని 360 స్పేషియల్‌ సౌండ్‌ అనుభవాన్ని ఆస్వాదించడానికి... దీన్ని WLA-NS7 ట్రాన్స్‌మిటర్‌తో రూపొందించారు. 360 స్పేషియల్ సౌండ్ పర్సనలైజర్ అనే యాప్ ద్వారా ఈ నెక్‌ బ్యాంక్‌ స్పీకర్‌ను ‘సోనీ బ్రావియా XR’ టీవీతో కనెక్ట్ చేసి సౌండ్‌ను ఆస్వాదించొచ్చు. అప్పుడు యూజర్ల చెవి 3డీ ఆకృతిని అంచనా వేసి వర్చువల్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా క్రిస్టల్ క్లియర్, X-బ్యాలెన్స్‌డ్ స్పీకర్ యూనిట్‌, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫంక్షనాలిటీతో ఈ నెక్‌బ్యాండ్‌ స్పీకర్‌ వస్తుంది. ఒకేసారి రెండు డివైజ్‌లతో ఈ నెక్‌బ్యాండ్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 12 గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుందట.

SRS-NB10 నెక్‌బ్యాండ్‌ స్పీకర్‌ కాల్స్‌ మాట్లాడటానికి, సంగీతం వినడానికి కూడా సహకరిస్తుంది. కచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీ, 20 గంటల బ్యాటరీ లైఫ్‌ దీని ప్రత్యేకతలు. సోనీ విడుదల చేసిన ఈ వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్‌ స్పీకర్లు IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్‌ సాంకేతికతతో వస్తున్నాయి. భారత్‌లోని సోనీ సెంటర్లు, ఇ-కామర్స్‌ సైట్లు, ప్రధాన ఎలక్ట్రానిక్‌ స్టోర్‌లలో జనవరి 24 నుంచి ఈ నెక్‌బ్యాండ్‌లు అందుబాటులోకి వచ్చాయి. SRS-NBS10 నెక్‌బ్యాండ్‌ స్పీకర్‌ ధర ₹11,990 ఉండగా, SRS-NS7 నెక్‌బ్యాండ్‌ను ₹22,990కి కొనుగోలు చేయవచ్చు. అలాగే WLA-NS7 వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్ ధర ₹5,690.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని