Samsung A03 Core: శాంసంగ్ కొత్త ఫోన్‌ ఏ03 కోర్‌

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ03 కోర్‌ పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఏమేం ఫీచర్లున్నాయి, ధరెంత, అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో చూద్దాం. 

Updated : 06 Dec 2021 22:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఏ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌ (Samsung Galaxy A03 Core) పేరుతో ఎంట్రీ-లెవల్‌ శ్రేణిలో ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. గతంలో విడుదల చేసిన గెలాక్సీ ఏ03ఎస్‌ మోడల్‌కు కొనసాగింపుగా గెలాక్సీ ఏ03 కోర్‌ను పరిచయం చేశారు. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత..ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో చూద్దాం. 

గెలాక్సీ ఏ03 కోర్‌ ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత గో ఎడిషన్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్‌ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ యూనిసాక్‌ ఎస్‌సీ9836ఏ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఈ ఫోన్‌లో రెండు కెమెరాలున్నాయి. వెనుకవైపు 8 ఎంపీ ప్రధాన కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 7,999. అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. బ్లాక్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని