360Hz టచ్‌ శాంప్లింగ్‌తో రెడ్‌మీ ‘K’ ఫోన్లు

వరుస లాంఛ్‌లతో అదరగొడుతున్న రెడ్‌మీ ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ కె40, కె40 ప్రో, కె40 ప్రో+ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్‌ హోల్ డిస్‌ప్లే, డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్స్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు....

Updated : 06 Sep 2022 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస లాంఛ్‌లతో అదరగొడుతున్న రెడ్‌మీ ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ కె40, కె40 ప్రో, కె40 ప్రో+ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్‌ హోల్ డిస్‌ప్లే, డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్స్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ఇంకా వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం..

రెడ్‌మీ కె40  

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్‌‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఈ4 అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా అమర్చారు. 4,520 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కి రెండు వైపుల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. 

రెడ్‌మీ కె40 ప్రో & కె40 ప్రో+ 

ఈ ఫోన్లలో కూడా 120Hz రిఫ్రెష్‌‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ12 ఓఎస్‌తో పనిచేస్తాయి. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉపయోగించారు. 4,520 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కె40 ప్రోలో వెనక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ఇక కె40 ప్రో+లో వెనక వైపు 108 ఎంపీ శాంసంగ్ హెచ్‌ఎం2 సెన్సర్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ, 5ఎంపీ కెమెరాలున్నాయి. రెండు ఫోన్లలో సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరాలు అమర్చారు. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్ ఇస్తున్నారు.   

ధర 

ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. రెడ్‌మీ కె40 6జీబీ, 8జీబీ, 12జీబీ ర్యామ్‌/128జీబీ, 256జీబీ మెమొరీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 1,999 యువాన్లు. భారత కరెన్సీలో సుమారు రూ. 22,500. కె40 ప్రో 6జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ప్రారంభ ధర 2,799 యువాన్లు. మన కరెన్సీలో సుమారు రూ. 31,500 ఉంటుందని అంచనా. కె40 ప్రో+ 12జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్ ధర 3,699 యవాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 41,600 ఉంటుందని అంచనా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని