వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ ఫీచర్లు తెలుసా?

ఫ్లాగ్‌షిప్‌ రేంజిలో స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చే వన్‌ప్లస్ కొత్తగా‌ రెండు మొబైల్స్‌ తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో మొబైల్స్‌ లాంచ్‌ చేసింది. వాటి ప్రధాన ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 

Updated : 23 Mar 2021 22:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చే వన్‌ప్లస్ కొత్తగా‌ మూడు మొబైల్స్‌ తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో, వన్‌ప్లస్‌ 9 ఆర్‌ మొబైల్స్‌ లాంచ్‌ చేసింది. దీంతోపాటు వన్‌ప్లస్‌ తొలి స్మార్ట్‌ వాచ్‌ను కూడా విడుదల చేసింది. భారత్‌లో ఈ సిరీస్‌ మొబైల్స్‌ ప్రారంభ ధర రూ.39,999గా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. వన్‌ ప్లస్‌ 9 (12జీబీ/256జీబీ) వేరియంట్‌ ధర రూ. 54,999గా ఉంది. హై‌ ఎండ్‌ వన్‌ప్లస్‌ 9 ప్రో ధర (8జీబీ/128జీబీ) వేరియంట్‌ రూ.64,999, 12జీబీ/256జీబీ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉన్నట్లు తెలిపింది. అలాగే వన్‌ప్లస్‌ 9 ఆర్‌ ధర రూ. 39,999 (8జీబీ ర్యామ్‌), రూ.43,999 (12జీబీ ర్యామ్‌)గా సంస్థ నిర్ణయించింది. మార్నింగ్‌ ఫిస్ట్‌, పైన్‌ గ్రీన్‌, స్టెల్లార్‌ బ్లాక్‌ కలర్స్‌లో ఈ మొబైల్స్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

వన్‌ ప్లస్‌ సిరీస్‌ మొబైల్స్‌ను భారత్‌లో ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 15 (ఈ రెండు తేదీల్లో) సంస్థ విక్రయించనుంది. ఎర్లీ యాక్సెస్‌ సేల్‌లో భాగంగా ఈ నెల మార్చి 31న వన్‌ ప్లస్‌ 9 వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొబైల్స్‌తో పాటు వార్ప్‌ ఛార్జ్‌ 50 వైర్‌లెస్‌ ఛార్జర్‌ను వన్‌ప్లస్‌.ఇన్‌లో రూ. 5,990కి వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. వన్‌ ప్లస్‌.ఇన్‌, అమెజాన్‌.ఇన్‌ వెబ్‌సైట్లు, అన్ని వన్‌ ప్లస్‌ అవుట్‌లెట్స్‌లో ఈ సిరీస్‌ మొబైల్స్‌ అందుబాటులో ఉంటాయి. అలాగే వన్‌ప్లస్‌ తొలి స్మార్ట్‌ వాచ్‌ ఏప్రిల్‌ నుంచి రూ.14, 999కి లభించనుంది. వాటి ప్రధాన ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

వన్‌ప్లస్‌ 9 ప్రో

వన్‌ప్లస్‌ 9 ప్రో ఫీచర్లు..
* క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌

50MP అల్ట్రా వైడ్‌ కెమెరా

48MP మెయిన్‌ కెమెరా (సోనీ ఐఎంఎక్స్‌ 789 సెన్సార్‌)

కర్వర్డ్‌ ఎడ్జ్‌ ఫ్లూయిడ్ డిస్‌స్లే 2.0

5 లేయర్ కూలింగ్‌ సిస్టమ్‌ (గేమింగ్‌ అనుభూతి కోసం)

అరగంట వ్యవధిలో 100% ఛార్జింగ్‌ అయ్యే విధంగా వార్ప్‌ ఛార్జ్‌ వ్యవస్థ

వన్‌ప్లస్‌ 9

 

వన్‌ప్లస్‌ 9 ఫీచర్లు..

* ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ 11 ఓఎస్‌

* 6.55-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే

* 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌

* 48 ఎంపీ మెయిన్‌  కెమెరా

* 16 ఎంపీ సెల్ఫీ కెమెరా

* 65టీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ

వన్‌ప్లస్‌ 9 ఆర్‌

వన్‌ప్లస్‌ 9 ఆర్‌ ఫీచర్లు..

* ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ 11 ఓఎస్‌

* 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌

* 48 ఎంపీ మెయిన్‌  కెమెరా

* 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ

పూర్తి వివరాల కోసం దిగువ వీడియో చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని