Android Smartphone: పాత ఫోన్‌కు కొత్త హంగులు.. ఎలాగంటే?
కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు.
ఇంటర్నెట్‌డెస్క్: కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. అయితే, పాత ఫోన్ కొన్నాళ్లు వాడిన తర్వాత దాని పనితీరు నెమ్మదిస్తుంది. తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతమాత్రన ఫోన్ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం చిన్నపాటిి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి పాత ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలి? అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అలాంటి యాప్స్‌కు గుడ్‌బై
అవసరానికో అబద్ధం అన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుత జీవనశైలిలో అవసరానికో యాప్ తయారైంది. ఆర్థిక లావాదేవీల నుంచి ఆన్లైన్ క్లాసుల వరకు.. గేమ్స్ నుంచి షాపింగ్ వరకు ప్రతి అవసరానికీ మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో చాలా వరకు మనం ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉపయోగించం. అలాంటి యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. అనవసరమైన ఇలాంటి యాప్స్ వల్ల ఫోన్ స్టోరేజీ నిండిపోతుంది. వీటిలో కొన్ని రకాల యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండటంతో ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. అందుకే ఫోన్లో మీకు అవసరంలేని యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే వాటినీ డిలీట్ చేయండి.
అలానే ఫోన్లో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వచ్చిన యాప్స్‌లో మీరు అవసరంలేని ఉంటే వాటిని డిజేబుల్ చెయ్యొచ్చు. అలాగే యాంటీ వైరస్, టాస్క్ కిల్లర్ యాప్స్ ఉంటే వాటిని కూడా తొలగించండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఫీచర్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్స్‌లో మాల్వేర్ను స్కాన్ చేసి తొలగిస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా యాప్స్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా మీరు ఉపయోగించని యాప్స్‌ను డిలీట్ చేస్తే ఫోన్ సామర్థ్యం మరింత మెరుగవుతుంది.
వాల్‌పేపర్.. విడ్జెట్స్ వద్దే వద్దు
మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తుంటే.. దాని పనితీరు గతంలో కంటే నెమ్మదిస్తే లైవ్ వాల్‌పేపర్స్, విడ్జెట్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమం. ప్రస్తుత ఫోన్లలో ర్యామ్, ఆధునిక ప్రాసెసర్లుతో వస్తుండటంతో వాటికి అనుగుణంగా లైవ్ పేపర్స్, విడ్జెట్స్ వంటి పీచర్లు ఇస్తున్నారు. అయితే కొన్ని పాత ఫోన్లలో ఓఎస్ అప్డేట్ చేసినప్పుడు ఈ ఫీచర్లు వస్తున్నాయి. ఇవి ఫోన్ హోం స్క్రీన్‌ను ఎంతో ఆకర్షణీయంగా మారుస్తున్నప్పటికీ పాత ఫోన్ల ర్యామ్, ప్రాసెసర్, బ్యాటరీ వంటి వాటి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వాటిని డిలీట్ చేయమని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.
అప్డేట్లు మరవకండి..
చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్ అపరేటింగ్ సిస్టం (ఓఎస్) అప్డేట్ గురించి పెద్దగా పట్టించుకోరు. అప్డేట్ గురించి నోటిఫికేషన్ ద్వారా సూచించినా ఇన్స్టాల్ చేయరు. అయితే వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పాత ఓఎస్‌లో ఉన్న లోపాలను సరిచేసి, ఫోన్ పనితీరును మెరుగుపరిచే ఫీచర్స్‌ను కొత్త ఓఎస్‌లో తీసుకొస్తారు. అందుకే ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. అలానే యాప్స్‌లో ఉండే లోపాల్ని సరిచేసి కొత్త ఫీచర్స్‌తో యాప్ అప్డేట్ను విడుదల చేస్తారు. వాటికి అప్డేట్ వచ్చినా తప్పక ఇన్స్టాల్ చేయాలి.
గో-ఎడిషన్, లైట్ యాప్స్ ఉన్నాయిగా..
ఫోన్లో యాప్స్ ఎక్కువ స్టోరేజీ ఉపయోగించకుండా ఉండేందుకు ఉన్న మరో ప్రత్యామ్నాయం గో-ఎడిషన్, లైట్ యాప్స్. ఇప్పటికే చాలా వరకు యాప్‌లు యూజర్ సౌకర్యార్ధం ఈ వెర్షన్ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ర్యామ్, ప్రాసెసర్, ఓఎస్ తక్కువ సామర్థ్యంతో ఉంటాయి. వీటికి అనుగుణంగా గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు ఇతర యాప్ డెవలపర్స్ గో-ఎడిషన్, లైట్ యాప్స్‌ను అందిస్తున్నారు. సాధారణ యాప్స్‌కు బదులు వీటిని ఉపయోగించొచ్చు.
ఫ్యాక్టరీ రీసెట్
మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉన్న మరో ఆప్షన్ ఫ్యాక్టరీ రీసెట్. ఇది ఫోన్లోని అనవసరమైన ఫైల్స్‌ని తొలగించి ఫోన్ కొన్నప్పుడు ఏవిధంగా ఉండేదో అలా మారుస్తుంది. అయితే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసేముందు అందులోని సమాచారాన్ని మరో చోట సేవ్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే ఫోన్లోని మొత్తం సమాచారం డిలీట్ అయిపోతుంది. అలానే మీ ఫోన్ కొన్నప్పుడు ప్రీ-ఇన్‌స్టాల్‌గా వచ్చిన యాప్స్ కూడా ఉంటాయి. అందులో మీకు అవసరంలేని వాటిని డిలీట్ చేసి.. మీకు అవసరం ఉన్న యాప్స్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్