Updated : 22/06/2021 15:12 IST

Audio Rooms: ఇది ఆన్‌లైన్‌ ‘రచ్చబండ’!

ఇంటర్నెట్‌ డెస్క్: సోషల్‌ మీడియా అంటే టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు... ఇది ఒకప్పుడు. ఇప్పుడు వీటికి ఆడియో యాడ్‌ అయ్యింది. కేవలం ఆడియో ద్వారా మాత్రమే నడిచే సోషల్‌ మీడియాదే ఇప్పుడు ట్రెండ్‌. ఇదెలా ఉందో ఒక వాక్యంలో చెప్పాలంటే... ‘నలుగురు మిత్రులు కూర్చుని మాట్లాడుకునే ఆన్‌లైన్‌ ఆడియో రచ్చబండ’ అనుకోండి. యాప్‌ వేదికగా అందరూ కలసి... ముచ్చట్లు పెట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ తరహా సర్వీసులు/యాప్‌లు ఏమున్నాయ్‌, ఏమొస్తున్నాయో చూద్దాం!


మొదలుపెట్టింది... ‘క్లబ్‌హౌస్‌’

ఆడియో బేస్డ్‌ సోషల్‌ మీడియా మొదలైంది క్లబ్‌హౌస్‌తో అని చెప్పొచ్చు. ఈ యాప్‌ మీరు ఉపయోగించాలకుంటే మిమ్మల్ని ఇప్పటికే యాప్‌ ఉపయోగిస్తున్న వ్యక్తులు నామినేట్‌ చేయాలి. దీని కోసం ముందుగా మీరు యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాథమిక వివరాలు ఇచ్చి ఖాతా తెరవాలి. ఆ తర్వాత మీ పేరుతో ఇన్వైట్‌ రిక్వెస్ట్‌ క్రియేట్ అవుతుంది. మీ కాంటాక్ట్స్‌ జాబితాలో ఇప్పటికే క్లబ్‌హౌస్‌ వాడుతున్న వారికి మీ రిక్వెస్ట్‌ నోటిఫికేషన్‌ రూపంలో చేరుతుంది. మీ రిక్వెస్ట్‌ని ఎవరైనా ఆమోదిస్తే మీ ఖాతా వినియోగానికి సిద్ధమవుతుంది. 

ఈ యాప్‌ వచ్చిన తొలినాళ్లలో ‘గుడ్‌ టైమ్‌ షో’ అనే చర్చలో ఎలాన్‌ మస్క్‌ మాట్లాడటంతో ఒక్కసారిగా యాప్‌కి క్రేజ్ ఏర్పడింది. క్లబ్‌ హౌస్‌లో కూడా జూమ్‌ యాప్‌ తరహాలోనే రూమ్స్‌ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ షేర్ చేయడం సాధ్యంకాదు. కేవలం స్పీకర్ మాట్లాడేది మాత్రం వినగలం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆడియో రూమ్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన అంశానికి సంబంధించిన దానిపై క్లిక్ చేసి ఆడియోను వినవచ్చు. ఒకవేళ మీరు మాట్లాడనుకుంటే ‘చేయి’ సింబల్‌పై క్లిక్‌ చేస్తే, రూమ్‌ క్రియేట్ చేసిన వ్యక్తి మీకు అవకాశం కల్పిస్తారు. అలా మీరు కూడా చర్చలో భాగస్వాములు కావొచ్చు.  మీకు నచ్చిన సమయంలో రూమ్‌ ఓపెన్‌ అయ్యేలా షెడ్యూల్‌ కూడా చేయొచ్చు. 


ట్విటర్‌ నుంచి స్పేసెస్‌

క్లబ్‌ హౌస్‌ వచ్చాక ఆ తరహా ఫీచర్‌ను తీసుకురావడంలో ట్విటర్‌ ముందుంది. స్పేసెస్‌ పేరుతో ట్విటర్‌ ఆడియో ఛాట్/డిస్కషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాప్‌లో ట్వీట్‌ కంపోజ్‌/ ప్లస్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే...  స్పేసెస్‌ బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే  యువర్ స్పేసెస్‌ అని పాప్‌ అప్‌ వస్తుంది. అందులో మీరు డిస్కషన్‌కు పెట్టాలనుకుంటున్న పేరు నమోదు చేసి స్పేసెస్‌ క్రియేట్ చేసుకోవాలి. ఇక అక్కడి నుంచి అంతా క్లబ్‌ హౌస్‌ తరహాలోనే పని చేస్తుంది. క్రియేట్‌ చేసిన స్పేస్‌ను అక్కడి నుంచే నేరుగా ట్వీట్‌ చేయొచ్చు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్పేస్‌లు ట్విటర్‌ ఫ్లీట్స్‌లో కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు జాయిన్‌ అవ్వొచ్చు. 


స్పాటిఫై గ్రీన్‌రూమ్స్‌

మ్యూజిక్‌, పాడ్‌కాస్ట్‌లతో యువతను ఆకట్టుకుంటున్న స్పాటిఫై కూడా ఆడియో సోషల్‌ మీడియాలోకి వచ్చేసింది. దీనికి గ్రీన్‌రూమ్‌ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ యాప్‌ డెవలప్‌మెంట్‌ మోడ్‌లో ఉంది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసి త్వరలో విడుదల చేస్తారు. ఇప్పటికే స్పాటిఫై ఖాతా ఉన్నవారు ఆ వివరాలతో గ్రీన్‌రూమ్‌లో లాగిన్‌ కావొచ్చు. ఆ తర్వాత క్లబ్‌హౌస్‌ తరహాలోనే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. అయితే ఇందులో రికార్డింగ్‌ ఆప్షన్‌ అదనంగా తీసుకొస్తున్నారు. రూమ్‌లో జరిగే డిస్కషన్‌ మొత్తాన్ని రికార్డు చేసి తర్వాత స్పాటిఫై హోస్ట్‌కు మెయిల్‌ చేస్తుందట. రూమ్‌లోకి ఎంటర్‌ అయ్యాక... ఆ రూమ్‌ ఎంతసేపటి నుంచి లైవ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. 


ఫేస్‌బుక్‌ కూడా వచ్చేసింది

వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉండే ఆప్షన్లు ఫేస్‌బుక్‌లో కూడా ఉండాలనేది మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆలోచన. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే,  ఇతర సోషల్‌ మీడియాలో ఉన్న ఫీచర్ల మీద ఓ లుక్కేస్తుంటారు. అలా తాజాగా ఆడియో బేస్ట్‌ సోషల్‌ మీడియా ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. లైవ్‌ ఆడియో రూమ్స్‌ పేరుతో క్లబ్‌ హౌస్‌ తరహా ఫీచర్‌ను యూఎస్‌లో తీసుకొచ్చింది. పనితనం అంతా క్లబ్‌హౌస్‌ తరహాలోనే ఉండబోతోంది. ఈ ఫీచర్‌ను ప్రచారం చేయడానికి యూఎస్‌లోని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఇందులో రూమ్స్‌ క్రియేట్‌ చేయిస్తోంది. ఈ ఫీచర్‌ త్వరలో మన దేశంలోనూ లాంచ్‌ చేయొచ్చని సమాచారం.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని