Updated : 14/11/2021 15:49 IST

Gaming Smartphones: ప్రీమియం కేటగిరీలో గేమింగ్ ఫోన్‌ కావాలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మొబైల్ గేమింగ్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా గేమింగ్‌కి అనుకూలమైన ప్రాసెసర్‌లతో ఉండే ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అయితే బడ్జెట్‌ ధరలో ఎన్నో రకాల మోడల్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ..ప్రీమియం కేటగిరీలో కొన్ని మోడల్స్‌ మాత్రమే ఉన్నాయి. మరి ఆ మోడల్స్‌ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధరెంత వంటి వివరాలు తెలుసుకుందాం.


శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌

గేమర్స్‌కి కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్‌తో శాంసంగ్ ఈ మోడల్‌ని డిజైన్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌21, గెలాక్సీ ఎస్‌21 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌21 అల్ట్రా మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ లభిస్తుంది. అన్ని మోడల్స్‌లో 120 హెర్ట్జ్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ లేదా ఎక్సినోన్‌ 2100 ప్రాసెసర్లను ఉపయోగించారు. ఎస్‌ 21లో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎస్‌21 ప్లస్‌లో 4,800 ఎంఏహెచ్‌, ఎస్‌21 అల్ట్రాలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఎస్‌21, ఎస్‌21 ప్లస్‌ మోడల్స్‌లో 64 ఎంపీ కెమెరాతోపాటు రెండు 12 ఎంపీ కెమెరాలు, ముందు 10 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇక ఎస్‌21 అల్ట్రాలో 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 12 ఎంపీ, రెండు 10 ఎంపీ కెమెరాలు, ముందు 40 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. వీటి ధర రూ. 64,999 నుంచి రూ. లక్ష వరకు ఉంది.


వన్‌ప్లస్‌ 9 ప్రో

ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఎల్‌టీపీవో బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ మారుతున్నప్పుడు మొబైల్ ఎక్కువ పవర్‌ వాడకుండా ఉండేందుకు సాయపడుతుంది. దాని వల్ల బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇందులో 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరాతోపాటు 48 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 12 జీబీ ర్యామ్‌/ 256 జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 65,999.


ఆసుస్‌ రోగ్ ఫోన్‌ 5

గేమింగ్ మొబైల్ అనగానే మొదట గుర్తొచ్చేది ఆసుస్‌ రోగ్‌ సిరీస్‌ ఫోన్లు. వీటిలో ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌ 5 మోడల్‌ను గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం ఈ ఫోన్‌లో మల్టీ ఇన్‌పుట్ మోషన్‌ గెస్చర్స్‌తోపాటు అల్ట్రా రెస్పాన్సివ్ ఎయిర్‌ ట్రిగ్గర్స్ అమర్చారు. 144 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 24 ఎంపీ కెమెరా అమర్చారు. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ అంతర్గత స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌/ 256 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 49, 999.


ఎంఐ 11 అల్ట్రా

గేమర్స్‌ కోసం ఈ ఫోన్‌లో 480 హెర్ట్జ్‌ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.81 అంగుళాల అమోలెడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌ వెనుక భాగంలో కెమెరాల పక్కన 1.1 అంగుళాల అమోలెడ్‌ టచ్‌ డిస్‌ప్లే కూడా అమర్చారు. ఫోన్ వేడెక్కకుండా ఇందులో మూడు దశల కూలింగ్ టెక్నాలజీని ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరాతోపాటు రెండు 48 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందుభాగంలో 20 ఎంపీ ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా అమర్చారు. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ ధర రూ. 69,999.


వివో ఎక్స్‌70 ప్రో ప్లస్‌

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888+ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 240 హెర్ట్జ్‌ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల క్యూహెచ్‌డీ రిజల్యూషన్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 55 వాట్‌ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ప్రో ఫొటోగ్రఫీ ఫీచర్స్ ఉన్నాయి. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 48 ఎంపీ, 12 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అమర్చారు. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్ ధర రూ.79,990.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని