3డీ స్కానింగ్‌

డాక్యుమెంట్లో, సర్టిఫికెట్లో స్కాన్‌ చేయటం కొత్త కాదు. మరి ఎప్పుడైనా ఆట వస్తువులాంటి వాటిని స్కాన్‌ చేశారా? అవీ ఫొటో మాదిరిగానే కనిపిస్తాయి కదా అని అనుకుంటున్నారా? అయితే ఈసారి ‘క్లోన్‌’

Published : 10 Nov 2021 01:03 IST

డాక్యుమెంట్లో, సర్టిఫికెట్లో స్కాన్‌ చేయటం కొత్త కాదు. మరి ఎప్పుడైనా ఆట వస్తువులాంటి వాటిని స్కాన్‌ చేశారా? అవీ ఫొటో మాదిరిగానే కనిపిస్తాయి కదా అని అనుకుంటున్నారా? అయితే ఈసారి ‘క్లోన్‌’ యాప్‌తో స్కాన్‌ చేసి చూడండి. ఇది 3డీలో స్కాన్‌ చేస్తుంది మరి. దీంతో 2డీ కెమెరా సాయంతోనే 3డీ నమూనాలను సృష్టించుకోవచ్చు. వాటిని ఎటు కావాలంటే అటు తిప్పి చూసుకోవచ్చు. అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. వివిధ ఆల్గోరిథమ్‌లు, పరిజ్ఞానాలతో కూడి ఉన్నప్పటికీ దీన్ని ఉపయోగించటం తేలికే. ముందుగా క్లోన్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ నుంచి ఆయా వస్తువుల పరిమాణానికి తగినట్టుగా స్కానింగ్‌ మ్యాట్‌ను కాగితం మీద ప్రింట్‌ తీసుకోవాలి. ఈ కాగితం నాణ్యతను బట్టి స్కాన్‌ స్పష్టత ఆధారపడి ఉంటుంది. తర్వాత స్కాన్‌ చేయాలనుకున్న వస్తువును మ్యాట్‌ మీద పెట్టి, స్మార్ట్‌ఫోన్‌లో క్లోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, వస్తువు మీద కేంద్రీకరించాలి. అప్పుడు పలు విభాగాలతో కూడిన ఓ అర్ధ గోళాకారం కనిపిస్తుంది. దాన్ని అనుసరిస్తూ వస్తువు చుట్టూ తిరుగుతూ నెమ్మదిగా స్కాన్‌ చేయాలి. ఐఓఎస్‌ పరికరాలతోనైతే మ్యాట్‌ లేకుండానే స్కాన్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని