వాట్సప్‌ వెబ్‌లోనూ ఫొటోల ఎడిటింగ్‌

గత కొద్ది నెలలుగా కొత్తందాలను పరిచయం చేస్తున్న వాట్సప్‌ తాజాగా వెబ్‌ వినియోగదారుల కోసమూ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వాట్సప్‌ వెబ్‌లోనూ ఫొటోలను ఎడిట్‌ చేసుకోవటానికి వీలుంటుంది.

Published : 10 Nov 2021 01:02 IST

త కొద్ది నెలలుగా కొత్తందాలను పరిచయం చేస్తున్న వాట్సప్‌ తాజాగా వెబ్‌ వినియోగదారుల కోసమూ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వాట్సప్‌ వెబ్‌లోనూ ఫొటోలను ఎడిట్‌ చేసుకోవటానికి వీలుంటుంది. పీసీలోంచి అప్‌లోడ్‌ చేసే ఫొటోలకు స్టికర్లు, టెక్స్ట్‌ జోడించుకోవచ్చు. ఫొటోలను క్రాప్‌ చేసుకోవచ్చు. కావాల్సినట్టు తిప్పుకోవచ్చు. ఇష్టమైనవారికి పంపించుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఫొటో ఎడిటర్‌ సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాదు.. ఎమోజీల మాదిరిగానే ఆయా అంశాలకు తగిన స్టికర్లను ఎంచుకునే అవకాశముంది. లింక్‌ ప్రివ్యూలను సైతం చూడొచ్చు. వార్తలైనా, వీడియోలైనా, ఫన్‌ ట్వీట్‌లైనా.. ఆయా లింకులకు సంబంధించిన అంశాలు కనిపిస్తుంటే అవి వేటికి సంబంధించినవనేది ముందే తెలిసిపోతుంది కదా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని