స్పిట్‌ స్క్రీన్‌ ఇలా..

సిస్టమ్‌ మీద ఒకేసారి వివిధ రకాల పనులు చేసేవారికి విండోస్‌ 10లో మంచి సదుపాయం ఉంది. అదే స్నాప్‌ అసిస్ట్‌ ఫీచర్‌. దీంతో స్క్రీన్‌ మీద విండోను ఎటంటే అటు జరుపుకోవచ్చు

Updated : 20 Oct 2021 06:13 IST

సిస్టమ్‌ మీద ఒకేసారి వివిధ రకాల పనులు చేసేవారికి విండోస్‌ 10లో మంచి సదుపాయం ఉంది. అదే స్నాప్‌ అసిస్ట్‌ ఫీచర్‌. దీంతో స్క్రీన్‌ మీద విండోను ఎటంటే అటు జరుపుకోవచ్చు. ఇందుకోసం ముందుగా విండోస్‌ 10 సెటింగ్స్‌లోకి ‘సిస్టమ్‌’ మీద క్లిక్‌ చేసి ‘మల్టీటాస్కింగ్‌’ ఫీచర్‌ను క్లిక్‌ చేయాలి. కుడివైపున కనిపించే స్నాప్‌ ఆప్షన్లను టర్న్‌ ఆన్‌ చేసుకోవాలి. దీంతో తెర మీద విండోస్‌ను ఆటోమేటిక్‌గా పక్కలకు, మూలలకు జరుపుకోవచ్చు. అందుబాటులో ఉన్న స్పేస్‌కు తగినట్టుగా విండోస్‌ ఆయా సైజుల్లో అవే స్థిరపడతాయి.

ముందుగా ఒకటి, అంతకన్నా ఎక్కువ విండోస్‌ లేదా అప్లికేషన్లను ఓపెన్‌ చేయాలి.

విండోస్‌ పైన ఖాళీగా ఉన్న భాగం మీద మౌస్‌ పెట్టి, ఎడమ మౌస్‌ బటన్‌ను నొక్కుతూ విండో ఎటువైపు ఉండాలని కోరుకుంటే అటువైపునకు డ్రాగ్‌ చేయాలి. ఆ సమయంలో విండో సైజు కూడా వెనక వైపున మసకగా కనిపిస్తుంది కూడా. మౌస్‌ ఏమాత్రం కదలనంతవరకు డ్రాగ్‌ చేసి వదిలేయాలి. అప్పుడు విండో ఆ స్థానంలో కుదురుకుంటుంది.

ఇలాగే ఇతర విండోస్‌ లేదా అప్లికేషన్లను ఆయా వైపలకు జరుపుకోవచ్చు. విండో పెద్దగా కనిపించాలనుకుంటే రీసైజ్‌ బటన్‌తో సెట్‌ చేసుకోవచ్చు.

క్లబ్‌హౌజ్‌లో మ్యూజిక్‌ మోడ్‌

ప్రముఖ ఆడియో చాట్‌ యాప్‌ క్లబ్‌హౌజ్‌ సంగీత కళాకారుల కోసం ‘మ్యూజిక్‌ మోడ్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ప్రత్యక్ష ప్రదర్శన చేసే కళాకారులు ప్రత్యేకమైన టూల్స్‌తో శబ్ద నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవటానికి వీలవుతుంది. యూఎస్‌బీ మైక్రోఫోన్స్‌ లేదా మిక్సింగ్‌ బోర్డుల వంటి పరికరాలనూ ఇందుకోసం వినియోగించుకోవచ్చు. రూమ్‌లో మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్‌ మోడ్‌ను ఎంచుకోవటానికి మూడు చుక్కల మెనూను నొక్కి, ‘ఆడియో క్వాలిటీ’ని ఎంచుకోవాలి. అనంతరం ‘మ్యూజిక్‌’ ఆప్షన్‌ను ఎంచుకొని సెషన్‌ను ఆరంభించొచ్చు. ప్రస్తుతానికి ఐఓఎస్‌ పరికరాలకే అందుబాటులో ఉన్నప్పటికీ మ్యూజిక్‌ మోడ్‌ ఫీచర్‌ త్వరలోనే ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు సెర్చ్‌ బార్‌నూ క్లబ్‌హౌజ్‌ మెరుగు పరుస్తోంది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా ఇది ఇకపై తెర పైభాగాన కనిపించనుంది. సెర్చ్‌ నుంచే స్నేహితులను పలకరించే వీలుంటుంది కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని