పాత పరికరం కొత్త ఉపయోగం
స్మార్ట్ఫోన్లు కావొచ్చు, ట్యాబెట్లు కావొచ్చు. ఏటా కొత్తరకంగా పలకరిస్తూనే ఉంటాయి. వినూత్న ఫీచర్లతో ఊరిస్తూనే ఉంటాయి. మనసెలా ఊరుకుంటుంది? ఏమైనా సరే వెంటనే కొనేస్తాం.....
రేడియో, పోడ్కాస్ట్ యాప్‌లకు పెద్ద కన్ఫిగరేషన్స్ అక్కర్లేదు. వీటి కోసమూ పాత పరికరాలు ఉపయోగ పడతాయి.
స్మార్ట్ఫోన్లు కావొచ్చు, ట్యాబెట్లు కావొచ్చు. ఏటా కొత్తరకంగా పలకరిస్తూనే ఉంటాయి. వినూత్న ఫీచర్లతో ఊరిస్తూనే ఉంటాయి. మనసెలా ఊరుకుంటుంది? ఏమైనా సరే వెంటనే కొనేస్తాం. మరి పాత పరికరాన్ని ఏం చేయాలి? ఇక్కడే పెద్ద సందేహం పుట్టుకొస్తుంది. ఇతరులకు ఇవ్వచ్చు. కావాలంటే అమ్మొచ్చు. రీసైక్లింగ్‌కు ఇవ్వచ్చు. అంతేనా? మనసు పెట్టి ఆలోచిస్తే కాలం చెల్లిన హార్డ్‌వేర్‌తో కూడిన పాత పరికరాలనైనా ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. అదీ అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టకుండానే. అలాంటి ఉపాయాల్లో కొన్ని ఇవీ..
మల్టీమీడియా పరికరంగా..
వంటింట్లోనో, ఆఫీసు గదిలోనో మరో టీవీని పెట్టుకోవాలని అనుకుంటున్నారా? టీవీ ప్రొవైడర్కో, స్ట్రీమింగ్ సర్వీసుకో చందా కట్టి ఉన్నట్టయితే పాత ఫోన్, ట్యాబ్లెట్నే టీవీగా మార్చుకోవచ్చు. టీవీ ప్రొవైడర్ లేదా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సర్వీసు యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే సరి. ఎంచక్కా నచ్చిన కార్యక్రమాలు, సినిమాలు అక్కడే చూసుకోవచ్చు. పాత పరికరాల్లో బ్యాటరీ త్వరగా నిండుకుంటుంది కాబట్టి విద్యుత్తు ప్లగ్ దగ్గరే పెట్టుకోవటం మంచిది. ఒకపక్క ఛార్జింగ్ అవుతూనే మరోవైపు వీడియోలు చూపిస్తుంది. కావాలంటే స్పీకర్ క్రాడిల్లోనూ పెట్టుకోవచ్చు. ఇదీ పరికరాన్ని ఛార్జ్ చేస్తుంది. ఇలా అంతరాయం లేకుండా సంగీతం, పోడ్‌క్యాస్ట్‌ల వంటివీ వినొచ్చు. బ్లూటూత్ స్పీకర్‌తో అనుసంధానం చేసుకున్నా మేలే. పాత ట్యాబ్లెట్లను ప్రత్యేకించి ఇ-బుక్ రీడర్లుగానూ వాడుకోవచ్చు. అంతేకాదు.. ఛార్జర్‌కు కనెక్ట్ చేసి డిజిటల్ ఫొటో ఫ్రేమ్గానూ ఉపయోగించుకోవచ్చు.
సార్వత్రిక రిమోట్‌గా..
స్మార్ట్ హోం ఉపకరణాలు, మ్యూజిక్ లైబ్రరీలు, ఇంటర్నెట్ కనెక్టెడ్ టీవీల వంటి పరికరాలను ఇప్పుడు యాప్స్‌తోనే కంట్రోల్ చేసే వీలుంది. మరి పాత ఫోన్, ట్యాబ్లెట్‌ను వీటన్నింటికీ ఉపయోగపడే రిమోట్ కంట్రోల్‌గా మార్చుకుంటే పోలా? ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్‌లు చాలానే ఉన్నాయి గానీ అమెజాన్, యాపిల్, గూగుల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సామ్సంగ్ వంటి సంస్థలు సొంత ప్రోగ్రామ్లతోనే పనిచేస్తాయి. ఆయా పరికరాల హార్డ్‌వేర్‌కు సరిపడిన యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. నట్టింటి నుంచే అన్ని పరికరాలనూ ఓ కంట కనిపెట్టొచ్చు. లైట్లు, స్మార్ట్ ప్లగ్‌లు, స్పీకర్లు, థర్మోస్టాట్స్.. చివరికి వ్యాక్యూమ్ క్లీనర్ల వంటి వాటిని దూరం నుంచే కంట్రోల్ చేయటానికి గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ హోం, ఓలిస్టో, ఐహాస్, స్మార్ట్‌థింగ్స్, యోనోమి, ఐఎఫ్‌టీటీటీ. హోం రిమోట్.. ఇలా చెప్పుకొంటూ పోతే వీటి జాబితాకు అంతే లేదు. ఐఓస్ పరికరాల కోసం యాపిల్ టీవీ, ఐట్యూన్స్ రిమోట్ యాప్‌లు ప్రయత్నించొచ్చు.
గేమింగ్ కోసం..
ప్రాసెసర్, బ్యాటరీ పరిస్థితిని బట్టి పాత పరికరాన్ని గేమింగ్ ఉపకరణంగానూ వాడుకోవచ్చు. ముందే మొత్తం డేటాను తొలగిస్తే మరిన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి, స్టోర్ చేసుకోవటానికి తగిన స్పేస్ లభిస్తుంది. మొబైల్ గేమింగ్‌కు అనుగుణంగా మార్చిన పాత గేమ్స్ యాప్‌స్టోర్‌లో చాలానే ఉన్నాయి. అలాగని వీటికే పరిమితం కావాల్సిన పనిలేదు. యాపిల్ ఆర్కేడ్, గూగుల్ స్టేడియా వంటి సబ్స్క్రిప్షన్ సర్వీసులు చాలా మొబైల్ పరికరాల్లో పనిచేస్తాయి. గూగుల్ క్రోమ్‌కాస్ట్ గేమ్ మోడ్ లేదా ఎయిర్‌ప్లే టెక్నాలజీ ద్వారానైతే టీవీల వంటి పెద్ద స్క్రీన్ల మీదా గేమ్స్ ఆడుకోవచ్చు. పాత ఫోన్‌కు రేజర్ కిషి వంటి ప్రత్యేక కంట్రోలర్లను అమర్చితే వేళ్లతో బటన్లను నొక్కుతూ తేలికగా ఆడుకోవచ్చు.
అటు వినోదం.. ఇటు విజ్ఞానం
పాత ఫోన్, ట్యాబ్లెట్లను పిల్లల చదువుల కోసమూ వాడుకోవచ్చు. గేమ్స్, ఎడ్యుకేషనల్ యాప్స్‌ను ఉపయోగించుకోవటాన్ని పిల్లలు బాగానే నేర్చుకున్నారని భావిస్తే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సెటింగ్స్‌లోకి వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించేయాలి. పిల్లల, పెద్దల భద్రతకు ఇది ఎంతైనా అవసరం. తర్వాత పిల్లల కోసం విడిగా అకౌంట్ తెరవాలి. పేరెంటల్ కంట్రోల్స్‌ను కన్ఫిగర్ చేసుకోవాలి. దీంతో పరికరాలను వాడే సమయం, యాప్ కొనుగోలు, ఇంటర్నెట్ యాక్సెస్ వంటి వాటిని నియంతించొచ్చు. ఒకవేళ ఫోన్ కెమెరా ఇంకా పనిచేస్తున్నట్టయితే, ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటున్నట్టయితే ఫొటోగ్రఫీలో పిల్లలకు పాఠాలు బోధించొచ్చు. పిల్లల యాప్‌స్టోర్ ఖాతాకు ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డును జతచేస్తే మనీ మేనేజ్మెంట్ నైపుణ్యాలూ అలవడతాయి. గంటలోపే ఛార్జింగ్ నిండుకునేట్టయితే కాలం విలువను, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటాన్నీ పరోక్షంగా నేర్పించినట్టూ అవుతుంది.
పెద్దవారి నిద్రకూ..
సమయానికి నిద్ర లేపటానికి, కంటి నిండా నిద్రపోవటానికి ఉపయోగపడే యాప్స్‌ను జోడిస్తే పాత ఫోన్ అయినా పెద్దవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- క్యారట్ అలారమ్ యాప్ వ్యంగ్య డైలాగులు, పాటలతో నిద్ర లేపుతుంది. ఇక పిజిజ్ యాప్ అయితే తేలికగా గాఢనిద్రలోకి జారుకునేలా చేస్తుంది. అలాగే ఉదయాన్నే నెమ్మదిగా నిద్ర లేపుతుంది. పాత ఫోన్‌తో రోజంతా పెద్దగా పనేమీ ఉండదు కాబట్టి అలా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే సరి. రాత్రంతా పనిచేస్తూనే ఉంటుంది.
నిఘా కెమెరాగా..
కెమెరా, వైఫై కనెక్షన్‌తో కూడిన పాత ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరాగానూ వాడుకోవచ్చు. ఇందుకోసం సంక్లిష్టమైన సాఫ్ట్వేర్లను సెట్ చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. ఖర్చూ అవసరం లేదు. ప్రజెన్స్ వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. పాత ల్యాప్‌టాప్‌లో విడిగా స్కైప్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. పాత ఫోన్ కెమెరా నుంచి ఇన్కమింగ్ వీడియోకాల్స్‌ను ఆటోమేటిక్‌గా స్వీకరించేలా ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. దీంతో ఆఫీస్ నుంచి ఇంటికి వీడియో కాల్ చేసుకోవటానికి, పెంపుడు జంతువుల వంటి వాటిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది.
పిల్లలను కనిపెట్టుకునేలా..
పాత మొబైల్ ఫోన్లు, ట్యాబెట్లు పిల్లలను కనిపెట్టుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారనేది చూసుకోవటానికి వీలుంటుంది. ముందుగా డోర్మీ వంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి వైఫైతో కనెక్ట్ అయితే సరి. పిల్లలు ఏడ్వటం వంటి శబ్దాలను యాప్ పసిగడుతుంది. వెంటనే వాటిని మన దగ్గరున్న ఫోన్‌కు చేరవేస్తుంది. అప్పుడు పిల్లలను వీడియోలో చూస్తూ, వారితో మాట్లాడుతూ సముదాయించొచ్చు కూడా.
కారును గుర్తించటానికి..
ఛార్జింగ్ కేబుల్‌కు అనుసంధానం చేసి పాత ఫోన్‌ను కారులో వెనకాల పడేశారనుకోండి. అలా పడుంటుంది. ఎప్పుడైనా అత్యవసరమైతే బ్యాకప్ ఫోన్‌గా ఉపయోగపడుతుంది. అదే లొకేషన్‌ను ఆన్‌చేసి ఉంచామనుకోండి. ఒకవేళ ఎవరైనా దొంగిలిస్తే కారు ఎక్కడుందనేదీ ఇట్టే పసిగట్టొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
వాట్సప్ కొత్త ఇమేజ్ ఎడిటర్
వాట్సప్ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇమేజ్‌లను షేర్ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
ఏఐ వీడియోకు సౌండ్ ట్రాక్ సొబగులూ
ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్
వాట్సప్ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్, మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. -
మీ అభ్యర్థి చరిత్రేంటి?
మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేేట్’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు -
గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!
ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్ ఏజెంట్ పుట్టుకొచ్చింది -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
ఏఐ పాట
కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్ జనరేటర్ వేదిక. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
డ్యూగూ.. సూర్యుడికే అన్న!
డ్యూగూ గ్రహ శకలం సూర్యుడి కన్నా ముందే పుట్టిందా? దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది. ఇప్పుడిదే ఆశ్చర్యం కలిగిస్తోంది. -
గూగుల్ లెన్స్‌లో సెర్చ్ హిస్టరీ సేవ్
గూగుల్ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ
వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్