Updated : 20/10/2021 04:01 IST

ఆడుకోండి ఆండ్రాయిడ్‌తో

మొబైల్‌ ఫోన్ల రంగాన్ని ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొత్త పుంతలు తొక్కించింది. విడుదలైనప్పట్నుంచీ వినూత్న ఫీచర్లతో ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇటీవలే ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికీ సరికొత్త ఫోన్లు చాలావరకు ఆండ్రాయిడ్‌ 11తోనే పనిచేస్తున్నాయి. యాపిల్‌ పరికరాలు చేతిలో లేవనే బాధను ఇది చాలావరకు మరిపించింది. ఐఓఎస్‌14 మాదిరిగానే క్విక్‌ సెటింగ్‌ బాక్స్‌, అసిస్టెంట్‌ కృత్రిమ గొంతును మార్చుకోవటం వంటి అధునాతన కంట్రోళ్లతో కట్టి పడేస్తోంది. దీని లోతుల్లోకి వెళ్లిన కొద్దీ ఉపయోగకరమైన కొత్త ఫీచర్లు మరెన్నో కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని ఇవీ..

హోల్డ్‌ ఫర్‌ మీ..

ర్చువల్‌ సహాయకారిగా గూగుల్‌ అసిస్టెంట్‌ను, కాల్స్‌ కోసం గూగుల్‌ యాప్‌ను ఎంచుకున్నారా? పిక్సెల్‌ 3 లేదా ఇతర కాంపిటేబుల్‌ ఫోన్‌ అయితే ‘హోల్డ్‌ ఫర్‌ మీ’ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, పైన కనిపించే మూడు చుక్కల మెనూ ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లాలి. ‘హోల్డ్‌ ఫర్‌ మీ’ ఆప్షన్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలి. దీంతో కస్టమర్‌ సర్వీస్‌ ప్రతినిధి కోసం వేచి చూడటం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులను తేలికగా ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు- ఏదైనా టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేశారనుకోండి. మన కాల్‌ను హోల్డ్‌లో పెట్టినట్టు తెలిసింది. అప్పుడు ఆన్‌స్క్రీన్‌ బటన్‌ను ట్యాప్‌ చేస్తే హోల్డ్‌ ఫర్‌ మీ ఆప్షన్‌ యాక్టివేట్‌ అవుతుంది. తర్వాత గూగుల్‌ అసిస్టెంటే మిగతా పనిని చూసుకుంటుంది. అవతలి వాళ్లకు ‘డోంట్‌ యాంగ్‌ అప్‌’ అనే నోటీస్‌ కనిపించేలా చేస్తుంది. కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ ప్రతినిధి కాల్‌ను పికప్‌ చేయగానే ఎవరో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారనే సందేశాన్ని తెర మీద ప్రత్యక్షం చేస్తుంది. ‘రిటర్న్‌ టు కాల్‌’ బటన్‌ను  ప్రముఖంగా చూపిస్తుంది. ఇది కాల్‌ ఆడియోతో పాటు ట్రాన్స్‌క్రిప్ట్‌ రూపంలోనూ కాల్‌ను నమోదు చేస్తుంది.


డైనమిక్‌ మీడియా కంట్రోళ్లు

ఆండ్రాయిడ్‌ 11 క్విక్‌ సెటింగ్స్‌లో మీడియా ప్లేయర్‌ ఇంకాస్త కిందికి చేరుకుంది. స్క్రీన్‌ మీది నుంచి కిందికి స్వైప్‌ చేస్తే మినీ ప్లేయర్‌ కనిపిస్తుంది. మరోసారి స్వైప్‌ చేస్తే ఫుల్‌ సైజు ప్లేయర్‌ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ మీడియా యాప్‌లు పనిచేస్తున్నట్టయితే అటూఇటూ స్వైప్‌ చేయటం ద్వారా ప్రతిదానికీ విడివిడిగా కంట్రోళ్లను చూడొచ్చు.


ఉపయోగపడే యాప్‌ సూచనలు

మనకు ఉపయోగపడే లేదా మనం వాడుకోవాలని అనుకునే యాప్‌లనూ ఆండ్రాయిడ్‌ 11 సూచిస్తుంది. వీటిని హోం స్క్రీన్‌ దిగువన ఖాళీగా ఉన్నచోట ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్‌ వద్దనుకుంటే హోం స్క్రీన్‌ మీద ఖాళీగా ఉన్నచోట వేలితో కాసేపు నొక్కి పట్టాలి. హోం సెటింగ్స్‌ ద్వారా ‘సజెషన్స్‌’ విభాగంలోకి వెళ్లి, ఆప్షన్లను మార్చుకోవచ్చు.


అతిథితో పంచుకోవటం

తరులకు మన ఫోన్‌ను ఇవ్వటమంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. మన కాంటాక్ట్‌లు, మెయిల్‌ జాబితాలన్నీ వెతకటానికి వారికి వీలు కల్పించినట్టే. ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవటానికి ‘మల్టిపుల్‌ యూజర్స్‌’ సెటింగ్స్‌ బాగా ఉపయోగపడుతుంది. దీంతో తాత్కాలికంగా అతిథి అకౌంట్‌ లేదా విడిగా యూజర్‌ అకౌంట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సెటింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, సిస్టమ్‌ ఫీచర్‌ ద్వారా ‘అడ్వాన్స్డ్‌ అండ్‌ మల్టిపుల్‌ యూజర్స్‌’లోకి వెళ్లాలి. తర్వాత ‘ఆన్‌’ బటన్‌ను ట్యాప్‌ చేయాలి. అనంతరం ‘యాడ్‌ యూజర్‌’ ఆప్షన్‌ ద్వారా కొత్త అకౌంట్‌ను లేదా గెస్ట్‌ అకౌంట్‌ను సృష్టించుకోవాలి. ఇక్కడ్నుంచి గానీ క్విక్‌ సెటింగ్స్‌ ద్వారా గానీ యూజర్‌ ఐకాన్‌ నుంచి దీన్ని యాక్సెస్‌ చేసుకోవచ్చు.


స్క్రీన్‌ రికార్డు

ప్రజెంటేషన్లు, డెమాన్‌స్ట్రేషన్లు, ట్రబుల్‌ షూటింగ్‌ కోసం స్క్రీన్‌ రికార్డింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు దీని కోసం థర్డ్‌ పార్టీ యాప్‌లే శరణ్యం. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ 11 ప్రత్యేకంగా స్క్రీన్‌ రికార్డింగ్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ముందుగా స్క్రీన్‌ పై భాగం నుంచి వేళ్లతో కిందికి స్వైప్‌ చేయాలి. అప్పుడు క్విక్‌ సెటింగ్స్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో రెండో పేజీ నుంచి సెటింగ్స్‌లోకి వెళ్లాలి. స్క్రీన్‌ రికార్డు ఐకాన్‌ మీద నొక్కాలి. అవసరమనుకుంటే ఆడియో, స్క్రీన్‌ కంట్రోళ్లను టర్న్‌ ఆన్‌ చేసి, స్టార్ట్‌ మీద ట్యాప్‌ చేయాలి. అంతే స్క్రీన్‌ రికార్డు అవుతుంది. దీన్ని ఆపేయాలని అనుకుంటే తెర మీది నుంచి కిందకి స్వైప్‌ చేసి, రెడ్‌ నోటిఫికేషన్‌ బార్‌ మీద ట్యాప్‌ చేయాలి. అప్పుడు మూవీస్‌ లైబ్రరీలో రికార్డింగ్‌ ఫైల్‌ సేవ్‌ అవుతుంది.


పిల్లుల ఆట

స్టర్‌ ఎగ్‌ ఆట ఆండ్రాయిడ్‌ 11లో ఆండ్రాయిడ్‌ నీకో గేమ్‌గా మారిపోయింది. తిండి, నీళ్లు, బొమ్మలు ఇవ్వటం ద్వారా పిల్లి బొమ్మలను సేకరించొచ్చు. ఈస్టర్‌ ఎగ్‌ మాదిరిగా క్విక్‌ సెటింగ్స్‌లో కాకుండా పవర్‌ మెనూ ఆధ్వర్యంలోని డివైస్‌ కంట్రోళ్లతో ఆడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా సెటింగ్స్‌లోని ‘అబౌట్‌ ఫోన్‌’ విభాగంలోకి వెళ్లి, ‘ఆండ్రాయిడ్‌ వర్షన్‌’ను కొద్దిసార్లు అదేపనిగా ట్యాప్‌ చేస్తుండాలి. వాల్యూమ్‌ డయల్‌ కనిపించాక 11 నంబరు కనిపించేంత వరకు తిప్పాలి. అప్పుడు తెరపై పిల్లి ఎమోజీ ప్రత్యక్షమవుతుంది. తర్వాత పవర్‌ బటన్‌ను కిందికి నొక్కితే పవర్‌ మెనూ కనిపిస్తుంది. మూడు చుక్కల మోర్‌ మెనూను ట్యాప్‌ చేసి యాడ్‌ కంట్రోల్స్‌ను ఎంచుకోవాలి. ‘సీ అదర్‌ యాప్స్‌’ను సెలెక్ట్‌ చేసుకొని, ‘క్యాట్‌ కంట్రోల్స్‌’ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత పవర్‌ మెనూకు నీటి పాత్ర, ఆహారం పెట్టే గిన్నె, పిల్లి బొమ్మనూ జోడించుకోవాలి. ఈ కంట్రోళ్లను ట్యాప్‌ చేయగానే నోటిఫికేషన్లలో లేదా బుడగల్లో పిల్లి బొమ్మ కనిపిస్తుంది. దీనికి పేరు పెట్టుకొని, సేవ్‌ చేసుకోవచ్చు.


యాప్‌ షార్ట్‌కట్స్‌ లేకుండా

ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు అది డిఫాల్ట్‌గా తనకుతానే హోం స్క్రీన్‌ మీద షార్ట్‌కట్‌గా కనిపిస్తుంది. దీంతో ఆ యాప్‌ను తేలికగా ఉపయోగించుకోవచ్చు గానీ కొన్నిసార్లు ఇది స్క్రీన్‌ను గజిబిజిగా కనిపించేలా చేయొచ్చు. అందువల్ల తనకు తానే షార్ట్‌కట్‌ క్రియేట్‌ కాకుండా ఉండాలనుకుంటే హోం స్క్రీన్‌ మీద ఖాళీగా ఉన్నచోట కొద్దిసేపు అలాగే నొక్కి పట్టుకోవాలి. అప్పుడు మెనూ పాపప్‌ అవుతుంది. తర్వాత హోం సెటింగ్స్‌ ద్వారా ‘యాడ్‌ ఐకాన్‌ టు హోం స్క్రీన్‌’ ఆప్షన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి.


అటు కంపెనీ, ఇటు వ్యక్తిగతం

సాధారణంగా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ఫోన్లను గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ పర్యవేక్షిస్తుంటుంది. యాప్స్‌, పర్మిషన్లు, డేటా వంటి వాటినిది నియంత్రిస్తుంటుంది. అయితే ఆండ్రాయిడ్‌ 11 విడిగా వ్యక్తిగత ప్రొఫైల్‌నూ క్రియేట్‌ చేసుకోవటానికీ వీలు కల్పిస్తుంది. ఫైళ్లను షేర్‌ చేసుకున్నప్పుడు వ్యక్తిగత, ఉద్యోగ అవసరాలకు విడివిడిగా ట్యాబ్స్‌ను వాడుకోవచ్చు. వర్క్‌ ప్రొఫైల్‌ను పాజ్‌ చేసుకునే ఫీచర్‌ సైతం అందుబాటులో ఉంటుంది. పని ముగిశాక ఫోన్‌ను పూర్తిగా వ్యక్తిగత పరికరంగా వాడుకోవచ్చు.


బుడగల్లో సంభాషణ

ముఖ్యమైన సంభాషణలు వెంటనే, తేలికగా అందుబాటులో ఉండాలని భావించేవారికి ‘బబుల్స్‌’ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇవి చిన్న వృత్తం మాదిరిగా తెర మీద ప్రత్యక్షమవుతాయి. వీటి మీద నొక్కి కన్వర్జేషన్‌ ఆరంభించొచ్చు. సంభాషణ ముగించటానికి ఒకసారి నొక్కితే చాలు. బబుల్స్‌ ఫీచర్‌ను తొలగించు కోవాలనుకుంటే వాటిపై నొక్కి పట్టి, అడ్డంగా డ్రాగ్‌ చేస్తే సరి. బబుల్స్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ లేదా డిసేబుల్‌ చేసుకోవటానికి ముందుగా యాప్స్‌లోకి వెళ్లి, నొటిఫికేషన్స్‌ను చేరుకోవాలి. నోటిఫికేషన్స్‌లో బబుల్స్‌ మీద నొక్కటం ద్వారా ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకోవచ్చు.


పవర్‌ బటన్‌తో..

తేలికైన క్విక్‌ సెటింగ్స్‌ ఉన్నప్పటికీ తరచూ వాడే కంట్రోళ్ల కోసం ఆండ్రాయిడ్‌ 11 మరో వెసులుబాటు కల్పించింది. అదే పవర్‌ బటన్‌. పవర్‌ మెనూ కనిపించేంతవరకు దీన్ని నొక్కి పట్టుకొని చూడండి. ఫోన్‌ షట్‌ డౌన్‌, రీస్టార్ట్‌ చేయటానికి షార్ట్‌ కట్స్‌ కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనటానికి గూగుల్‌ పేను ఉపయోగించుకోవటానికి, స్మార్ట్‌ హోం పరికరాలను నియంత్రించటానికీ వీలుంటుంది. రెండుసార్లు వేగంగా పవర్‌ బటన్‌ను నొక్కి కెమెరా యాప్‌నూ ఓపెన్‌ చేయొచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని