ఒప్పో రెండు తెరలు..

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ప్రస్తుతం చాలావరకూ రెండు తెరల ఫోన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. కొన్ని కంపెనీలు...

Updated : 14 Apr 2021 17:07 IST

మొబైల్‌ మాయ

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ప్రస్తుతం చాలావరకూ రెండు తెరల ఫోన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే డ్యుయల్‌ స్క్రీన్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తెచ్చేశాయి కూడా. ఇప్పుడు ఒప్పో సైతం ఇలాంటి ఒరవడిని కొనసాగించేందుకు సిద్ధం అయ్యింది. 8, 7 అంగుళాల పరిమాణాల్లో రెండు రకాలుగా ఫోల్డబుల్‌ ఫోన్‌లను తయారు చేయాలని సంకల్పించింది. రెండూ లోపలికి మడిచే ఫోన్‌లే. ముందుగా 7 అంగుళాల ఫోన్‌ని మార్కెట్‌లోకి తేవాలని భావిస్తోంది. మరోవైపు షామీ ఇప్పటికే ‘మీ మాక్స్‌ ఫోల్డ్‌’ మోడల్‌ని చైనాలో విడుదల చేసేయటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని