iphone 13: ఐఫోన్ సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేశారా? ఓసారి చూడండి!
మొబైల్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్న ఐఓఎస్15 సెట్టింగ్స్ గురించి మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ (Apple iphone) ఈ ఏడాది ఐఫోన్ 13 సిరీస్‌తో మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐఫోన్ 13, 13 మినీ, 13ప్రో, 13 ప్రో మాక్స్ వంటి మోడళ్లను యాపిల్ సంస్థ రూపొందించింది. వీటి తయారీకి వాడిన హార్డ్‌వేర్‌లో చిన్న తేడాలు ఉండొచ్చు. కానీ, ప్రతీది ఒకటే సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. మరి వీటన్నింటిలో ఉన్న ఐఓఎస్15 సెట్టింగ్స్ గురించి మీకు తెలుసా? యాపిల్ తయారుచేసిన ఐఫోన్లన్నీ ఇక ఐఓఎస్15 తోనే వస్తాయి. ఇందులో ఫేస్‌టైమ్, సఫారీ లాంటి చాలా రకాల ఫీచర్లు ఉంటాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం..
1. ఫుల్ స్క్రీన్ ఇన్కమింగ్ కాల్ అలర్ట్
ఐఓఎస్ 14 రాకముందు ఐఫోన్లో ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు డిస్ప్లే మొత్తాన్ని ఆక్రమించినట్లుగా కనిపించేది. ఇది వినియోగదారులకు అసౌకర్యంగా ఉండేది. ఐఓఎస్ 14 వచ్చాక యాపిల్ దీన్ని పూర్తిగా మార్చేసింది. స్క్రీన్‌పైనా నోటిఫికేషన్ల లాగా వచ్చేలా రూపొందించింది. ఇది చాలా సందర్భాల్లో మిస్సైన కాల్స్‌ను వినియోగదారుడికి గుర్తు చేస్తుండేది. ఐఫోన్లో ఈ సెట్టింగ్ చేర్చుకోవాలంటే.. సెట్టింగ్‌లోకెళ్లి ఫోన్ సెట్టింగ్స్>తర్వాత ఇన్కమింగ్ కాల్స్ లో ఉన్న ఫుల్ స్క్రీన్ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
2. ఛేంజ్ సిరి వాయిస్
ఈ ఏడాది ప్రారంభంలో ఐఓఎస్ 14.5 వచ్చాక సిరి రెండు కొత్త స్వరాలను అందించింది. మొట్టమొదటిసారి సిరిలో ఫీమేల్ వాయిస్ డిఫాల్ట్‌గా రాకుండా మనమే సిరి వాయిస్‌ను ఎంచుకొనే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చారు. మనకు నచ్చిన వాయిస్‌ను మార్చుకొనే వెసులుబాటును కల్పించారు. ఒక్కసారి ఆప్షన్ సెలక్ట్ చేసుకోగానే యాపిల్ ఐడీతో ఉన్న అన్ని డివైసెస్‌లో సిరి వాయిస్ మారిపోతుంది. దీన్ని సెట్టింగ్స్‌లోకెళ్లి సిరి అండ్ సెర్చ్ ఆప్షన్ ఎంచుకొని సిరి వాయిస్ మీద క్లిక్ చేస్తే చాలు సిరి వాయిస్ ఛేంజ్ అయిపోతుంది.
3. 5జీ కవరేజీని ఆఫ్ చేసుకోవచ్చు..
యాపిల్ ఫోన్లలో ప్రత్యేకమైన 5జీ స్మార్ట్ డేటా ఫీచర్ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఆటోమెటిక్‌గా 4జీ నుంచి 5జీ కి మారేలా ఉంటుంది. నెట్‌వర్క్‌లో వచ్చే స్వల్ప మార్పుల వల్ల బ్యాటరీ దెబ్బతినే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ డేటా వృథా అవుతుందనుకున్నా.. 5జీ స్పీడ్‌ను వద్దనుకున్నా.. బ్యాటరీ సామర్థ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా ఈ ఆటోమెటిక్ స్విచ్ ఉపయోగపడుతుంది. దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు.. అలాగే అవసరం అనుకున్నప్పుడు ఆన్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మార్చుకోవడం కోసం.. సెట్టింగ్‌లోకెళ్లి సెల్యూలర్>సెల్యూలర్ డాటా ఆప్షన్>వాయిస్ అండ్ డేటాలో ఎల్టీఈని యాక్టివేట్ చేసుకుంటే 5జీ కవరేజీ ఆఫ్ అయిపోతోంది. అలాగే 5జీ కవరేజీ ఆన్‌ను సెలక్ట్ చేసుకుంటే 5జీ ఆన్ అవుతోంది.
4. ఫేస్మాస్క్తోనూ ఫోన్ అన్‌లాక్..
ఫేస్ లాక్ సెట్టింగ్ ద్వారా మన ఫోన్ అన్‌లాక్ చేసుకోవచ్చని మనకి తెలుసు. అయితే, ఫేస్‌మాస్క్ ఉన్నపుడు ఫోన్ అన్‌లాక్ చేయడం ఎలా? సగమే కనిపించే ఫేస్‌తో ఫోన్‌ను అన్ లాక్ చేయడం కష్టమవుతుంది. దీనికోసం యాపిల్ ప్రత్యేకంగా ఫేస్ ఐడీ టెక్నాలజీని తీసుకువచ్చింది. కానీ, దీనికోసం కచ్చితంగా యాపిల్ వాచ్ ఉండాలని కండిషన్‌ను పెట్టింది. దీంతో ఫేస్ కనిపించకుండా ఉన్నా ఫోన్ అన్‌లాక్ అయ్యేలా చేస్తోంది. దీనికోసం సెట్టింగ్ యాప్‌లో ఫేస్ఐడీ అండ్ పాస్‌కోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కిందికి స్క్రోల్ చేశాక అన్‌లాక్ విత్ యాపిల్ వాచ్ సెక్షన్ అనే ఫీచర్‌ను సెలక్ట్ చేసుకుంటే ఫేస్ మాస్క్ ఉన్నా ఫోన్ అన్ లాక్ అవుతుంది.
5. టెక్స్ట్‌ను సులువుగా చదివేయచ్చు..
ఐఫోన్ స్క్రీన్‌పై ట్యాప్ చేయడం ద్వారా ఫాంట్ సైజ్‌ను అడ్జెస్ట్ చేసుకొని టెక్ట్స్‌ను సులువుగా చదివే అవకాశాన్ని కూడా ఐఓఎస్15 సెట్టింగ్స్ తీసుకువచ్చింది. దీనికోసం సెట్టింగ్స్>డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ > టెక్స్ట్ సైజును యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.
6.డార్క్ మోడ్‌తో బ్యాటరీ ఆదా...
మొబైల్ స్క్రీన్ బ్రైట్నెస్ను ప్రతిసారీ అడ్జెస్ట్ చేసుకోవడం వీలుకాదు. దీంతో బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికోసం ఐఓఎస్15 సెట్టింగ్స్‌లో డార్క్ మోడ్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే బ్యాటరీని ఆదా చేసుకోవడంతోపాటు వైట్బ్యాక్ గ్రౌండ్ ఉన్న అప్లికేషన్స్‌ను కూడా డార్క్ మోడ్‌లోకి మార్చుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోకి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఆప్షన్స్‌లో స్క్రీన్‌పైన ఉన్న డార్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరి.
7.ఆటో బ్రైట్నెస్ను డిసబుల్ చేసుకోవచ్చు..
స్క్రీన్ బ్రైట్‌నెస్‌తో బ్యాటరీ పనితీరుపైనా తీవ్ర ప్రభావం పడుతోందని మనందరికీ తెలిసిందే. అయితే, ఎంత మేర లైట్ వస్తుందో తెలుసుకొని ఆటోమెటిక్‌గా అడ్జస్ట్ చేసుకునేలా ఐఓఎస్‌ను రూపొందించారు. దీన్ని మొత్తాన్ని నియంత్రించాలనుకుంటే డిసబుల్ ఆటో బ్రైట్నెస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. మనం ఏదయితే సెట్ చేసి పెట్టుకుంటామో తిరిగి మనం మార్చుకునేంత వరకు అదే లెవల్లో బ్రైట్నెస్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్>ఆక్ససెబిలిటీ>డిస్ ప్లే అండ్ టెక్ట్స్ సైజ్‌లో కింద ఉన్న ఆటో బ్రైట్నెస్ను స్విచ్‌ను టర్న్ ఆఫ్ చేసుకోవాలి.
8.కెమెరా ఫీచర్స్‌లో హెచ్డీఆర్ వీడియో ఆఫ్ చేసుకోవచ్చు..
ఐఫోన్12, ఐఫోన్13 ఫోన్లలో హెచ్డీఆర్ వీడియో రికార్డు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, హెచ్డీఆర్ వీడియోను ఇతర ఫోన్లకు షేర్ చేస్తే అది అన్నిట్లో సపోర్ట్ చేయకపోవచ్చు. దీనికోసం డెవలపర్స్ కొత్తగా అప్డేట్ చేయాల్సి ఉంది. కొన్ని ఫోన్లలో హెచ్డీఆర్ వీడియో క్వాలిటీతో చూడాలంటే ప్రత్యేక పరికరం అవసరం అవుతుంది. అయితే, ఇందులో హెచ్‌డీఆర్‌తో రికార్డు చేసుకునే వెసులుబాటుతో హెచ్డీఆర్ లేకుండా వీడియో రికార్డు చేసే సెట్టింగ్స్ కూడా ఐఓఎస్15 లో ఉంది. దీనికోసం సెట్టింగ్>కెమెరా>రికార్డు వీడియో>హెచ్డీఆర్ వీడియో ఆఫ్ పొజిషన్ స్విచ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?