Updated : 22/07/2021 18:25 IST

HalloApp: వాట్సాప్‌ మాజీల ‘హల్లో’కి హలో చెప్తారా!

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ నెట్‌వర్క్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక ఆత్మీయులతో సంభాషణలు, స్నేహితులతో చిట్‌ఛాట్‌లు, భావ వ్యక్తీకరణ సర్వసాధారణమైపోయాయి. అందుకే ఎన్ని రకాల సోషల్ యాప్‌లు వచ్చినా యూజర్స్ వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ మెసేంజర్‌, వాట్సాప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌, సందేశ్‌ ఇలా ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో హల్లోయాప్‌ పేరుతో కొత్త యాప్‌ వచ్చి చేరింది. ఇది కొత్త తరం సోషల్ నెట్‌వర్క్. దీని సాయంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉద్యోగులతో సులువుగా కనెక్ట్ కావచ్చు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులో ఉంది. మరి ఈ యాప్‌ను ఎవరు రూపొందించారు..ఇది ఎలా పనిచేస్తుంది..ఇందులో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో తెలుసుకుందాం.

వాట్సాప్‌ మాజీల సృష్టి

ఈ యాప్‌ను నీరజ్ అరోరా, మైఖేల్ డోనూ అనే ఇద్దరు వాట్సాప్‌ మాజీ ఉద్యోగులు రూపొందించారు. గతంలో నీరజ్‌ వాట్సాప్‌ బిజినెస్‌ గ్లోబల్‌ హెడ్‌గా, మైఖేల్ ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ‘‘ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రైవేటు వ్యవహారం కాదు. యూజర్స్‌ని ప్రొడక్ట్స్‌గా చూసే పద్ధతి మారాలి. అల్గారిథమ్‌తో ఒకరితో ఒకరు కనెక్ట్ కావచ్చు. అలానే యూజర్స్‌ ఇతరులతో సులువుగా కనెక్ట్ అవుతూ, తమకు నచ్చిన సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఒక ప్రైవేట్ స్పేస్ అందిచాలనే ఆలోచనతోనే హల్లో యాప్‌ని అభివృద్ధి చేశాం’’ అని నీరజ్‌ ట్వీట్ చేశారు. గోప్యత పరంగా కూడా హలోయాప్ ఎంతో సురక్షితమైందని, యూజర్ల నుంచి ఎలాంటి డేటా సేకరించడంలేదని నీరజ్ వెల్లడించారు.

ఎలా పనిచేస్తుంది 

హల్లోయాప్‌ని ప్లేస్టోర్‌ లేదా యాప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్‌ అయ్యాక యాప్‌ ఓపెన్ చేసి పేరు, మొబైల్‌ నెంబరు టైప్ చేస్తే..ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసి మీ ఖాతాను ప్రారంభించవచ్చు. యాప్‌ను ఉపయోగించే ముందు ఫోన్‌లోని కాంటాక్ట్స్‌, ఫొటో గ్యాలరీని యాక్సెస్ చేసేందుకు అనుమతించాలి. తర్వాత మీరు యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. 

హల్లోయాప్ ప్రత్యేకతలేంటి

ఈ యాప్‌లో హోమ్, గ్రూప్స్‌, ఛాట్స్‌, సెట్టింగ్స్‌ అని నాలుగు ఐకాన్స్‌ ఉంటాయి. హోమ్‌లో మీకు ఇతరులు చేసే పోస్ట్‌ల వివరాలు కనిపిస్తాయి. వాటిపై మీరు కామెంట్ చెయ్యొచ్చు లేదా రిప్లై ఇవ్వచ్చు. ఇక గ్రూప్స్‌లో మీరు ఇతరులతో కలిసి గ్రూప్ క్రియేట్ చేసుకుని సంభాషించుకోవచ్చు. ఛాట్‌ ఫీచర్‌తో మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులతో ఛాట్ చేయడంతోపాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఇందులోని మెసేజ్‌లకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుంది. అలానే పోస్ట్‌లకి లైక్, ఫాలో ఆప్షన్లు ఉండవు. ఇతరులను మీరు బ్లాక్ చెయ్యొచ్చు. మీ హల్లోయాప్‌ ఖాతాలని ఇతర సోషల్‌ మీడియా ఖాతాలతో లింక్ చేయలేరు. ఒకవేళ మీ డేటా కావాలన్నా, అకౌంట్‌ డిలీట్‌ చేయాలకున్నా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రిక్వెస్ట్‌ డేటా, డిలీట్‌ అకౌంట్‌ ఆప్షన్లు ఉంటాయి. హల్లోయాప్‌లో యాడ్స్‌ ఉండవు. మీ మొబైల్‌ కాంటాక్ట్స్‌లోని వాళ్లు యాప్‌లో ఖాతా తెరిస్తే ఛాట్ పేజ్‌లో మీకు కనిపిస్తుంది. తర్వాత మీకు వారితో డైరెక్ట్‌గా సంభాషించవచ్చు. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని