Published : 04/12/2020 16:12 IST

6K బ్యాటరీ..10K ధరలో టెక్నో కొత్త ఫోన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టెక్నో కంపెనీ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పోవా పేరుతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. పెద్ద బ్యాటరీ, పంచ్‌ హోల్ డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌, ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్ పోకో ఎం2, రెడ్‌మీ 9 ప్రైమ్‌ ఫోన్లతో పోటీపడనుంది. యువత లక్ష్యంగా తీసుకొస్తున్న ఈ ఫోన్‌ ధరెంత..అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి వంటి విషయాలు తెలుసుకుందాం.

పోవా ఫీచర్స్‌

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత హెచ్‌ఐఓఎస్‌ 7.0‌తో పనిచేస్తుంది. 6.8-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 16 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో డ్యూయల్‌ ఫ్లాష్‌తో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ కెమెరాలో ఏఐ సెల్ఫీ కెమెరా, ఏఐ బ్యూటీ, వైడ్ సెల్ఫీ, నైట్ పోట్రెయిట్, ఏఐ హెచ్‌డీఆర్‌, ఏఆర్ షాట్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ డ్యూయల్ ఐసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. టెక్నో పోవా 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 9,999. 6జీబీ ర్యామ్‌/128జీబీ ధర రూ. 11,999. డాజిల్ బ్లాక్‌, మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 11 తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని