గెలాక్సీ నోట్‌ ఫోన్లకు శాంసంగ్‌ గుడ్‌బై

వచ్చే ఏడాది నుంచి శాంసంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ సిరీస్‌ ఫోన్‌లను నిలిపివేయనుందట. ఈ మేరకు కంపెనీ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు. కొవిడ్‌-19 ప్రభావంతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం...

Published : 01 Dec 2020 21:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఏడాది నుంచి శాంసంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ సిరీస్‌ ఫోన్‌లను నిలిపివేయనుందట. సంబంధిత వర్గాలు దీనిని ధ్రువీకరించారని సమాచారం. కొవిడ్‌-19 ప్రభావంతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకు‌ గెలాక్సీ నోట్ వేరియంట్‌లో శాంసంగ్ మూడు మోడల్స్‌ని తీసుకొచ్చింది. గెలాక్సీ నోట్ 9, గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 20. ప్రతి మోడల్‌లోను రెండు వేరియంట్లున్నాయి. పెద్ద స్క్రీన్‌, ఆకర్షణీయమైన డిజైన్‌, ఎస్‌ పెన్ వంటి ఎన్నో ప్రత్యేకతలు నోట్ ఫోన్లలో ఉన్నాయి. ఏటా శాంసంగ్‌ గెలాక్సీ నోట్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేస్తుంది. అయితే 2021లో మాత్రం గెలాక్సీ నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను తీసుకురావడంలేదని తెలుస్తోంది. 

అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో ఎస్‌21 మోడల్‌లో ఎస్‌ పెన్‌ను ఆఫర్ చేయనున్నారట. త్వరలో రాబోయే శాంసంగ్‌ ఫోల్డబుల్ ఫోన్‌లు కూడా ఎస్‌ పెన్ సపోర్ట్ చేసేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మీదట ఎస్‌ పెన్‌ను ఫోన్‌తో కాకుండా ప్రత్యేకంగా విక్రయించనున్నారు. అయితే గెలాక్సీ నోట్ సిరీస్‌ ఫోన్లు నిలిచిపోనున్నాయనే దానిపై స్పందించేందుకు శాంసంగ్‌ ప్రతినిధి నిరాకరించారు. కానీ ఈ ఏడాది ప్రీమియం కేటగిరీలో ఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయనేది వాస్తమేనని..యూజర్స్ ఎక్కువగా కొత్త మోడల్స్‌ కోరుకోవడం లేదనేందుకు ఇది సంకేతమని ఆయన అన్నారు. శాంసంగ్‌ 2011లో యాపిల్‌ ఫోన్లకు పోటీగా నోట్‌ సిరీస్‌ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అదే ఏడాది తొలిసారి ప్రపంచంలోనే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు ఉత్పత్తి చేసిన కంపెనీగా అవతరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని