Fastest Internet: సెకనులో 57వేల సినిమాలు డౌన్‌లోడ్‌

మీరు ఒక సెకండులో 57వేల సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోగలరా? కేవలం 3 సెకండ్లలోనే  స్పోటిఫై లైబ్రరీ మొత్తాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగలరా? అదెలా సాధ్యం? అంత ఇంటర్నెట్‌ స్పీడ్‌ అసాధ్యం? అంతా  

Updated : 29 Jul 2021 16:22 IST

మీరు ఒక సెకండులో 57వేల సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోగలరా? కేవలం 3 సెకండ్లలోనే  స్పోటిఫై లైబ్రరీ మొత్తాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగలరా? అదెలా సాధ్యం? అంత ఇంటర్నెట్‌ స్పీడ్‌ అసాధ్యం? అంతా ఇలాగే అనుకుంటుండొచ్చు. కానీ జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ పరిశోధకుల కృషి గురించి తెలిస్తే ‘ఓస్‌ ఇంతేనా?’ అని అనటం తథ్యం. అవును.. డిజిటల్‌ ట్రాక్‌లో ఏకంగా ఉసెయిన్‌ బోల్ట్‌నే సృష్టించారు మరి. సెకండుకు 319 టెరాబైట్ల సమాచారాన్ని పంపించి, ఇంటర్నెట్‌ స్పీడ్‌లో అత్యంత వేగం రికార్డును సాధించారు. అత్యంత అధునాతనమైన నాసా వ్యవస్థ సెకండుకు 400 గిగాబైట్ల వేగంతోనే నడుస్తోంది. మనదేశంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సగటు వేగం 17.84 ఎంబీపీఎస్‌. వీటితో పోల్చి చూస్తే జపాన్‌ పరిశోధకులు సాధించిన ఇంటర్నెట్‌ వేగం అనూహ్యమనే అనుకోవచ్చు. ఇంత వేగంతో సెకండులో 57వేల పూర్తి నిడివి సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే- ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టికల్‌ ఫైబర్‌ సదుపాయాలతోనే దీన్ని సుసాధ్యం చేయటం. అంటే కొద్దిపాటి ఖర్చుతోనే ఇప్పుడున్న ఫైబర్‌ ఆప్టిక్‌ సదుపాయాలతో దీన్ని సమ్మిళితం చేయొచ్చన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని