Published : 11/09/2020 18:45 IST

పీడీఎఫ్‌ ఎడిట్‌ చేయాలా... ఇవి ట్రై చేయండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: మీ స్నేహితులో, తోటి ఉద్యోగులెవరో మీకు ఒక టెక్ట్స్‌ డాక్యుమెంట్ పంపారు. అందులో తప్పులు ఉంటే కొంచెం చూసి సరిచేయమన్నారు. కానీ అందులో మార్పులు చేద్దామంటే అదేమో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంది. ఇప్పుడేలా అనుకుంటున్నారా.. ఫీడీఎఫ్ ఫైల్స్‌లో ఎక్కడి నుంచైనా సులభంగా మార్పులు చేసుకునేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కొన్ని ప్రత్యేక యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినట్లుగా పీడీఎఫ్ పేజీలను ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అలానే అవేంటో ఒక్కసారి చూసేయండి మరి... 


సెజ్‌దా (Sejda)

ఇది వెబ్‌, డెస్క్‌టాప్‌ యాప్‌ వెర్షన్స్‌లో అందబాటులో ఉంది. దీన్ని ఉపయోగించి పీడీఎఫ్ ఫైల్‌లో కావాల్సిన చోట మార్పులు చేసుకోవచ్చు. వేర్వేరు పీడీఎఫ్ పేజీలను ఒక్కటిగా కలపొచ్చు. అలానే ఒకటి కన్నా ఎక్కువ పేజీలున్న పీడీఎఫ్ ఫైల్స్‌ని వేర్వేరు ఫైల్స్‌గా మార్చుకోవచ్చు. ఇంకా పేజీలను డిలీట్ చేయడం, అవసరమైన చోట సంతకాలు యాడ్‌ చేయడం, డాక్యుమెంట్ భద్రత కోసం పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకునే సదుపాయం ఉంది. ఇది పూర్తిగా ఉచితం. అయితే ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. రోజుకు మూడు ఫైల్స్‌కి సంబంధించిన పనులు మాత్రమే చేయగలం. అలానే ఫైల్‌ సైజ్‌ 50ఎంబీ దాటకూడదు..ఫైల్‌ 200 పేజీలకు మించకూడదు..కేవలం 50 పేజీలను మాత్రమే ఒక్కటిగా కలపగలం. ఇలాంటి పరిమితులు లేకుండా వాడుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించి ప్రో వెర్షన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి.


ఐలవ్‌పీడీఎఫ్ (ILovePDF)

పీడీఎఫ్ ఫైల్స్‌ని వేరే ఫార్మాట్‌లోకి మార్చడమే కాకుండా వివిధ రకాల ఫైల్స్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి మార్చాలంటే ఐలవ్‌పీడీఎఫ్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. కావాల్సిన చోట వాటర్‌మార్క్‌ యాడ్ చేసుకోవడం, డాక్యుమెంట్‌కి పాస్‌వర్డ్‌ తొలగించడం, కరప్ట్‌ అయిన పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఇందులో సరిచేసుకోవచ్చు. ఇది టెక్ట్స్, ఇమేజ్‌ ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది. అలానే టెక్ట్స్‌ ఫాంట్‌, కలర్‌, సైజ్‌లలో సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా మీరు ఎడిట్‌ చేయాలనుకుంటున్న పీడీఎఫ్ ఫైల్‌ని గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్‌, కంప్యూటర్‌ నుంచి యాక్సెస్‌ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.


మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ (Microsoft Word)

అదేంటి వర్డ్‌లో పీడీఎఫ్ ఫైల్ ఎలా ఎడిట్ చేయడం అనుకుంటున్నారా. కొన్ని పరిమితులతో చేయవచ్చు. అయితే పీడీఎఫ్‌ పార్మాట్‌లో మాత్రం కాదు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఫైల్‌పై క్లిక్‌ చేసి ఓపెన్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న పీడీఎఫ్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని వర్డ్‌ ఆటోమేటిగ్గా కన్వర్ట్‌ చేసి అందులో టెక్ట్స్‌ని వర్డ్‌లో చూపిస్తుంది. అలా టెక్ట్స్‌లో మీకు కావాల్సిన చోట మార్పుటు చేసుకొని తిరిగి దాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎక్కువ ఇమేజస్‌, రకరకాల ఫాంట్ సైజుల ఉన్న పీడీఎఫ్ పేజీలను మాత్రం ఇందులో ఎడిట్ చేసుకోలేం.  


స్మాల్‌ పీడీఎఫ్ (Small PDF)

ఐలవ్‌పీడీఎఫ్ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది. అవసరమైన చోట టెక్ట్స్‌, ఇమేజస్‌, షేప్స్‌ని యాడ్‌ చేసుకోవడంతో పాటు అవసరం లేని చోట వాటిని సులభంగా తొలగించవచ్చు. పీడీఎఫ్ ఫైల్స్‌ని డైరెక్ట్‌గా కంప్యూటర్, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్‌ నుంచి అప్‌లోడ్‌ చేసి ఎడిట్ చేయ్యొచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌ యూజర్స్‌కి ఎక్స్‌టెంక్షన్‌ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా డైరెక్ట్‌గా బ్రౌజర్‌లోనే పీడీఎఫ్ ఫైల్స్‌ని ఎడిట్, మెర్జ్‌, స్ప్లిట్, కంప్రెస్‌, కన్వర్ట్‌ చేసుకోవచ్చు.


పీడీఎఫ్-ఎక్సేంజ్‌ ఎడిటర్‌ (PDF-XChange Editor)

ఇది విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌. ఇతర ఉచిత వెబ్‌ యాప్‌ల కంటే ఎక్కువ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. అయితే మీరు పీడీఎఫ్‌లో మార్పులు చేసిన తర్వాత పేజ్‌ మూలలో క్రియేటెడ్ విత్ పీడీఎఫ్ ఎక్స్‌ఛేంజ్‌ ఎడిటర్ అని చిన్న వాటర్‌ మార్క్‌ వస్తుంది. అందువల్ల ఎక్కువ మంది దీన్ని వాడేందుకు ఇష్టపడరు. టెక్ట్స్‌, కామెంట్స్‌, వాటర్‌ మార్క్‌, ఇమేజస్‌ను యాడ్ చేసుకోవచ్చు. అలానే స్కాన్‌ లేదా జిరాక్స్‌ తీసిన డాక్యుమెంట్స్‌ను టెక్ట్స్‌ రూపంలోకి కన్వర్ట్‌ చేసుకునే ఓసీఆర్‌ ఫీచర్‌ కూడా పీడీఎఫ్ ఎక్సేంజ్ ఎడిటర్‌లో ఉంది.


అడోబ్ ఆక్రోబాట్ ప్రో & స్టాండర్డ్ (Adobe Acrobat Pro & Standard)

రోజు అధిక సంఖ్యలో ఫీడీఎఫ్ ఫైల్స్‌తో పని ఉంటే మాత్రం అడోబ్ ఆక్రోబాట్ ప్రో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో పీడీఎఫ్‌కు సంబంధించిన అన్ని రకాల మార్పులు చేసుకోవచ్చు. టెక్ట్స్‌, ఇమేజ్‌ యాడింగ్‌ నుంచి స్కాన్‌ డాక్యుమెంట్‌ని పీడీఎఫ్‌గా మార్చుకోవడం వరకు ఎలాంటి పనినైనా సులభంగా పూర్తి చేయవచ్చు. దీన్లో ప్రో, స్టాండర్డ్‌ అని రెండు వెర్షన్‌లు ఉంటాయి. స్టాండర్డ్ వెర్షన్‌ కేవలం విండోస్‌ ఓఎస్‌ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. ప్రో మాత్రం అన్ని రకాల ఓఎస్‌లలో పనిచేస్తుంది. కానీ దీనికి సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని