Virat:తృటిలో గోల్ మిస్‌...ఛెత్రి ఫన్నీ కామెంట్

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్‌ కోహ్లికి ఫుట్‌బాల్ అంటే అమితమైన ప్రేమ. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన తన సహచర ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతుంటాడు విరాట్. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టుకు విరాట్.. సహ యజమానిగా కూడా ఉన్నాడంటే ఈ ఆటంటే అతనికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది

Published : 27 May 2021 00:20 IST

(photo:Virat Kohli Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్‌ కోహ్లికి ఫుట్‌బాల్ అంటే అమితమైన ప్రేమ. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన తన సహచర ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతుంటాడు విరాట్. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టుకు విరాట్.. సహ యజమానిగా కూడా ఉన్నాడంటే ఈ ఆటంటే అతనికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం కోహ్లి ఎన్నో ఫుట్‌బాల్ మ్యాచుల్లో పాలుపంచుకున్నాడు. ఇక భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రి, కోహ్లి మంచి స్నేహితులనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

అయితే, ఫుట్‌బాల్‌ ఆడటంలో తనకున్న ప్రావీణ్యాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ వీడియోని పోస్టు చేశాడు విరాట్. ఈ వీడియోలో కోహ్లి... ఫ్రీ కిక్‌ కొట్టగా.. తృటిలో గోల్ మిస్‌ అయింది. దాంతో విరాట్ నవ్వుతూ చేతులతో మొహాన్ని దాచుకున్నాడు. ఈ వీడియోకి ‘యాక్సిడెంటల్‌ క్రాస్‌బార్‌ ఛాలెంజ్‌’ అనే క్యాప్షన్‌ను జతచేశాడు కోహ్లి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

అయితే, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రి.. ఈ వీడియోకి ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘కోహ్లి.. అన్ని కోచింగ్ సెషన్లకి కలిపి ఒకేసారి మొత్తం బిల్లు పంపాలా.. లేదా వాయిదాల రూపంలోనా?’ అని సరదాగా కామెంట్ చేశాడు. ఆ వీడియోలను మీరు కూడా చూసేయండి!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని