Virat Kohli: కోహ్లీ చిన్న లోపం గమనించిన రమీజ్‌

 టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో చిన్నలోపం ఉందని పాక్ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు. దానిని సరిదిద్దుకొంటే అతడు భారీ స్కోర్లు చేయగలడని ధీమా వ్యక్తం చేశాడు.

Published : 05 Jun 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో చిన్నలోపం ఉందని పాక్ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు. దానిని సరిదిద్దుకొంటే అతడు భారీ స్కోర్లు చేయగలడని ధీమా వ్యక్తం చేశాడు. ఆరంభంలో స్ట్రెయిట్‌గా, తన సహజశైలిలో ఫ్లిక్స్‌ ఆడాలన్నాడు. ఆ తర్వాత పరుగులు అవే వస్తాయని తెలిపాడు. టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరుకోవడంతోనే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఆసక్తి పెరిగిందని వెల్లడించాడు.

‘బంతిని ఆలస్యంగా ఆడుతున్నప్పుడు విరాట్‌ బ్యాటింగ్‌ను గమనించాను. లెగ్‌సైడ్‌ వైపు లైన్‌కు అడ్డంగా ఆడుతున్నాడు. అతడి మణికట్టుపై ఒత్తిడి పడుతోంది. అతడు క్రీజ్‌లో తన పొజిషన్‌లో ఉండి స్ట్రెయిట్‌గా ఆడాలి. తనదైన శైలిలో ఫ్లిక్స్‌ ఆడితే చాలు. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఏదేమైనా ఏం చేయాలో అతడికి తెలుసు. అందుకే అతడి బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రమీజ్ తెలిపాడు.

‘కొన్నిసార్లు శతకాలు చేయకపోతే, పరుగులు రాకపోతే తమను తామే ఒత్తిడిలోకి నెట్టేసుకుంటారు. తొలి 20-25 ఓవర్లను కోహ్లీ స్ట్రెయిట్‌గా ఆడితే మణికట్టు బాగుంటుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అతడు రాణిస్తాడు’ అని రమీజ్‌ రాజా తెలిపాడు. ఛాంపియన్‌షిప్‌ను ఇప్పటిలా కాకుండా అన్ని జట్లతో ఆరు నెలల కాలంలో నిర్వహిస్తే బాగుంటుందని సూచించాడు.

ఛాంపియన్‌షిప్‌ సమయంలో మరే ఫార్మాట్‌ ఉండకూడదని రమీజ్‌ పేర్కొన్నాడు. రెండేళ్ల సమయంలో ఎవరు ఎవరితో ఆడారో కూడా మరచిపోయే అవకాశం ఉందన్నాడు. కేవలం భారత్‌ ఫైనల్‌ చేరుకోవడంతోనే ఆసక్తి పెరిగిందన్నాడు. అదే న్యూజిలాండ్‌తో మరేదైనా జట్టు ఆడుతుంటే ఇంత క్రేజ్‌ ఉండేది కాదని స్పష్టం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని