Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్లు ఎలా ఆడారంటే..

ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే, మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో సింధు కాంస్యం గెలవడంతో భారత్‌కు ఈసారి రెండో పతకం ఖాయమైంది...

Published : 01 Aug 2021 22:20 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే, మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో సింధు కాంస్యం గెలవడంతో భారత్‌కు ఈసారి రెండో పతకం దక్కింది. మరోవైపు భారత పురుషుల జట్టు బ్రిటన్‌పై విజయం సాధించడంతో 41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరింది.

రోజు మొత్తం ప్రదర్శన..

గోల్ఫ్‌: ఈరోజు జరిగిన గోల్ఫ్‌ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ ఈవెంట్‌లో అనిర్బన్‌ లాహిరి 42వ స్థానంలో నిలవగా మరో అథ్లెట్‌ ఉదయన్‌ మానె 56వ స్థానంలో నిలిచి నిరుత్సాహ పరిచారు.

ఈక్వెస్ట్రియన్‌: ఈ ఆటలో భారత ఏకైక అభ్యర్థి ఫవాద్‌ మిర్జా రెండో రౌండ్‌గా పిలిచే క్రాస్‌ కంట్రీలో 22వ స్థానంలో నిలిచాడు. శనివారం అతడు తొలి రౌండ్‌గా పిలిచే డ్రెస్సేజ్‌లో 28 పెనాల్టీస్‌తో 9వ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.

బాక్సింగ్‌: బాక్సింగ్‌ సూపర్‌ హెవీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ ఓటమిపాలయ్యాడు. ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ బాఖోదిర్‌ జలొలోవ్‌ చేతిలో 0-5 తేడాతో విఫలమయ్యాడు.

బ్యాడ్మింటన్‌: ఇక బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో పీవీ సింధు విజేతగా నిలిచింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోపై 21-13, 21-15 తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది.

హాకీ: భారత పురుషుల హాకీ జట్టు 1980 తర్వాత తొలిసారి సెమీస్‌ చేరింది. ఈ సాయంత్రం గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడిన సందర్భంగా 3-1 తేడాతో ఆ జట్టును చిత్తుగా ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని