Tokyo Olympics: బాక్సింగ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ 

భారత స్టార్‌ బాక్సర్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ అమిత్‌ పంఘాల్‌ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాడు. దాంతో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది...

Published : 31 Jul 2021 12:23 IST

ప్రీ క్వార్టర్స్‌లో ఓటమిపాలైన అమిత్‌ పంఘాల్‌

టోక్యో: భారత స్టార్‌ బాక్సర్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ అమిత్‌ పంఘాల్‌ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాడు. దాంతో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేతగా నిలిచిన యుబెర్జెన్‌ మార్టినెజ్‌ చేతిలో అమిత్‌ 1-4 తేడాతో విఫలమయ్యాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అమిత్‌పై భారీ అంచనాలు ఉండగా.. తొలి రౌండ్‌లోనే ఫర్వాలేదనిపించాడు. తర్వాత పూర్తిగా తేలిపోయాడు.

ఇక రెండో రౌండ్‌లో మార్టినెజ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించి భారత బాక్సర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పర్‌ కట్స్‌తో ఎదురుదాడి చేసి అమిత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. చివర్లో మరింత దూకుడుగా పంచులు కురిపించిన అతడు అమిత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో భారత బాక్సర్‌ డిఫెన్స్‌ చేసుకోడానికే ప్రయత్నించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అమిత్ ఓటమిపాలైనా ఇటీవల భారత్‌ తరఫున బాక్సింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బాక్సర్‌గా కొనసాగుతున్నాడు. 2018 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన అతడు తర్వాతి ఏడాది 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుపొందాడు. 2017 తర్వాత అతడిలా పెద్ద ఈవెంట్లలో ఓటమిపాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని