T20 World Cup: నన్ను తొలగించడానికి వాళ్లెవరు? : అక్తర్
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పీటీవీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆ ఛానెల్లో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అతడిని.. అక్కడి వ్యాఖ్యాత డాక్టర్ నౌమన్ నియాజ్ వెళ్లిపోవాల్సిందిగా చెప్పాడు...
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పీటీవీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆ ఛానల్లో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అతడిని.. అక్కడి వ్యాఖ్యాత డాక్టర్ నౌమన్ నియాజ్ వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఊహించని అవమానానికి గురైన అక్తర్ వెంటనే అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లాడు. ఇదంతా లైవ్‌లో ప్రసారమవ్వడం గమనార్హం. అయితే, ఈ విషయంపై సదరు టీవీ ఛానల్ గురువారం రాత్రి ఓ ప్రకటన జారీ చేసింది. దానికి సైతం అక్తర్ దీటుగా బదులిచ్చాడు.
అక్తర్, నౌమన్ మధ్య జరిగిన వివాదం మీద విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యేవరకూ ఇద్దరినీ తమ టీవీ ఛానల్ కార్యక్రమాల్లో అనుమతించబోమని పీటీవీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇది చూసిన పాక్ మాజీ పేసర్.. ‘మీ నిర్ణయం చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను 22 కోట్ల మంది పాకిస్థానీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మంది ముందే ఆ ఛానల్‌కు రిజైన్ చేశాను. పీటీవీకి పిచ్చెక్కిందా ఏమైనా? టీవీ కార్యక్రమాల్లో వాళ్లెవరు నన్ను తొలగించడానికి?’ అంటూ తనదైనశైలిలో స్పందించాడు.
అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 26న పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం పీటీవీ లైవ్ డిబేట్ నిర్వహించగా షోయబ్ అక్తర్ హాజరయ్యాడు. అతడితో పాటు సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావేద్లాంటి మాజీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అక్తర్.. పాక్ బౌలర్లు హరీస్ రవూఫ్, షహీన్ ఆఫ్రిదిపై ప్రశంసలు కురిపించగా నౌమన్ మధ్యలో కలుగజేసుకొని.. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు.
అయితే, అక్తర్ ఆ మాటలను పట్టించుకోకుండా తన అభిప్రాయాలు కొనసాగించడంతో ఆ వ్యాఖ్యాతకు కోపమొచ్చింది. దీంతో షోయబ్ తనపట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దీన్ని సహించబోనని.. తన షో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదంతా ప్రత్యక్షప్రసారం అవుతుండగానే జరిగింది. చివరికి అక్తర్ తన మైక్రోఫోన్ తొలగించి బయటకు వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక ఆ కార్యక్రమం అలాగే కొనసాగడం కొసమెరుపు. తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్‌లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
కోల్‌కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్