Team India: భారత్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవమే.. ఎలాగో తెలుసా?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఇంకా సెమీస్‌ అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన గతరాత్రి అఫ్గానిస్థాన్‌తో...

Published : 05 Nov 2021 01:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. గతరాత్రి అఫ్గానిస్థాన్‌ను దంచికొట్టి ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌ ఆశలను నిలుపుకొంది. పోటీలో నిలవాలంటే తప్పక గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. గతరెండు మ్యాచ్‌ల్లాగే మరోసారి టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన.. ఈసారి 210/2 భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించడంతో గ్రూప్‌-2 పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగు పర్చుకొని నాలుగో ప్లేస్‌లో నిలిచింది. దీంతో ఇప్పుడందరూ టీమ్‌ఇండియా సెమీ ఫైనల్‌ చేరాలని కోరుకుంటున్నారు.

కోహ్లీసేన ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే అంత తేలికేం కాదు. అయితే టీ20 క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. న్యూజిలాండ్‌ తన ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా టీమ్‌ఇండియాకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మన జట్టు మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో స్కాట్లాండ్‌, నమీబియాలపై నెగ్గి రన్‌రేట్‌ను (అఫ్గాన్‌ కన్నా 1.481 ప్రస్తుతం) మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్‌ఇండియా ప్రస్తుత రన్‌రేట్‌ 0.073. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు కష్టమేం కాదు. కానీ.. కివీస్‌ ఆ రెండు జట్లతో ఓడాలంటే మాత్రం అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో భారత అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ప్రధానంగా అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పైనే పడ్డాయి. ఆ మ్యాచ్‌లో కివీస్‌ ఓటమిపాలై భారత్‌ ముందుకు సాగాలని ఆశిస్తున్నారు. అదే జరగాలని మనమూ ఆశిద్దాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని