Peng Shuai Missing: పెంగ్‌ షవాయి విషయంపై మౌనంగా ఉండకూడదు: సెరెనా

చైనా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి కనిపించకపోవడంపై అటు అభిమానులు, ఇటు తోటి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే జకోవిచ్‌, నవోమీ ఒసాక..

Published : 20 Nov 2021 01:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి కనిపించకపోవడంపై అటు అభిమానులు, ఇటు తోటి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై గతంలో ఇదివరకే జకోవిచ్‌ (సెర్బియా), నవోమీ ఒసాక (జపాన్‌) స్పందించగా తాజాగా అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌ కూడా ఆ జాబితాలో చేరారు. షువాయి అదృశ్యం వార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైనట్లు ట్వీట్‌ చేసింది. ఆమె క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు సెరీనా పేర్కొంది. ఈ విషయంలో మౌనంగా ఉండకుండా తగిన విచారణ జరిపించాలని కోరింది.

మరోవైపు పెంగ్‌ షువాయి ఎక్కడంటూ ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్నా చైనా మాత్రం పెదవి విప్పడం లేదు. ఆ దేశ మాజీ సీనియర్‌ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఈ నెల 2న షువాయి సంచలన ఆరోపణలు చేసింది. కానీ ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో పెంగ్‌ షువాయి ఎక్కడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రజలు, క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ స్టీవ్‌ సిమన్‌కు షువాయి ఓ ఈ మెయిల్‌ చేసినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తాను క్షేమంగానే ఉన్నానని, గతంలో తాను చేసిన ఆరోపణలన్నీ అబద్దమని పేర్కొంటూ ఆమె పంపిన మెయిల్‌పై సందేహాలు రేకెత్తుతున్నాయని సిమన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని