IND vs NZ: రోహిత్, ‌రాహుల్‌కు కాస్త సమయం ఇచ్చి చూడాలి: ఉతప్ప

టీమ్‌ఇండియా టీ20 కొత్త సారథి రోహిత్‌ శర్మ - ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ల ఆలోచనా విధానాలను అర్థం చేసుకోవాలంటే కాస్త సమయమిచ్చి చూడాలని సీనియర్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అభిప్రాయపడ్డాడు...

Published : 22 Nov 2021 01:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టీ20 కొత్త సారథి రోహిత్‌ శర్మ - ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ల ఆలోచనా విధానాలను అర్థం చేసుకోవాలంటే కాస్త సమయమిచ్చి చూడాలని సీనియర్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ హిట్‌మ్యాన్‌ ఐదుగురు బౌలర్లనే ఉపయోగించుకున్నాడు. అయినా, జట్టు వరుస విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌పై మాట్లాడిన ఉతప్ప తన ఆలోచనలు పంచుకున్నాడు.

‘కెప్టెన్‌గా రోహిత్‌ ఆరో బౌలర్‌ అవకాశాన్ని విశ్వసించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఐదుగురు బౌలర్లతోనే రాణించడం నాకు సంతోషంగా ఉంది. మనం రోహిత్‌, రాహుల్‌కు కాస్త సమయం ఇచ్చి చూడాలి. వాళ్ల ప్రణాళికలు ఏంటో అర్థం చేసుకోవాలంటే వేచి చూడక తప్పదు. మూడో టీ20లో వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌ చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ.. మనం అతడికి ఎందుకు బౌలింగ్‌ ఇవ్వట్లేదని అడిగేముందు కెప్టెన్‌కు కచ్చితంగా సమయం ఇవ్వాలి’ అని ఉతప్ప చెప్పుకొచ్చాడు. మరోవైపు రోహిత్‌ ఆలోచనా విధానం పూర్తి వేరుగా ఉందని, ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు సరైన ప్రదర్శన చేయలేక ఓడిపోవడంతో మనమంతా ఆరో బౌలర్‌ గురించి ఆలోచిస్తున్నామని అతడు వివరించాడు. అదే సమయంలో రోహిత్‌ ఐదుగురు బౌలర్లతోనే మంచి ప్రదర్శన చేయొచ్చనే నమ్మకంతో ఉండొచ్చన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని